Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga 2023: భూమి కదులుతోంది.. ఈ ఏడాది లో జరగనున్న వైపరీత్యాల గురించి వెంగబాబా చెప్పింది తప్పదా?

టర్కీ, సిరియాలో ఏర్పడిన భూకంపాలతో 2023లో ఏర్పడనున్న ప్రకృతి బీభత్సాల గురించి నోస్ట్రాడమస్ మహిళగా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా చెప్పిన భవిష్యవాణిని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. 

Baba Vanga 2023: భూమి కదులుతోంది.. ఈ ఏడాది లో జరగనున్న వైపరీత్యాల గురించి వెంగబాబా చెప్పింది తప్పదా?
Baba Vanga 2023
Follow us
Surya Kala

|

Updated on: Feb 07, 2023 | 10:39 AM

టర్కీ, సిరియా దేశాలు వరస భూకంపాలతో వణికిపోతున్నాయి. ఎటుచూసినా హృదయవిదారక ఘటనలే దర్శనమిస్తున్నాయి. సుమారు 4 వేలమంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించినా.. శిధిలాల కింద భారీగా ప్రజలు చిక్కుకున్నారని.. మృతుల సంఖ్య భారీగా ఉండనుందని అధికారులు చెబుతున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.. ఈ నేపథ్యంలో 2023లో ఏర్పడనున్న ప్రకృతి బీభత్సాల గురించి నోస్ట్రాడమస్ మహిళగా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా చెప్పిన భవిష్యవాణిని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు.

  1. 2023 ఏడాదికి సంబందించిన మానవ జీవితం, ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలను బాబా వంగా వెల్లడించారు. 2023లో కొన్ని నెలలు చీకటి ఏర్పడనుందని, మనుషుల జీవితం నాశనం అవుతుందని ఆమె అంచనా వేశారు. భూమి కక్ష్యలో మార్పు ఉంటుందని దీంతో భూమిపై అనేక మార్పులకు జరుగుతాయని చెప్పారు. సౌర తుఫానుతో సహా అనేక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడనున్నాయని చెప్పారు. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ , వాతావరణ మార్పులతో మానవ జీవితం అల్లకల్లోలంగా మారనుందని పేర్కొన్నారు.
  2. 2023లో సౌర తుఫాను లేదా సౌర సునామీ ఏర్పనుంది. దీని ఫలితంగా భూమి అయస్కాంత పొర తీవ్రంగా నాశనం అయ్యే అవకాశం ఉందని బాబా వంగా అంచనా వేశారు. బాబా వంగా అంచనాల ప్రకారం.. అత్యంత శక్తివంతమైన సౌర తుఫానులు సాంకేతికతను దెబ్బతీస్తాయని అంచనా వేశారు. ఇది భారీ విద్యుత్తు అంతరాయం.. కమ్యూనికేషన్ వైఫల్యాలకు దారితీస్తుంది.
  3.  ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో ఒకటి ప్రజలపై జీవ ఆయుధాలతో దాడి చేయడానికి పరిశోధనలు చేస్తుందని బాబా వంగా జోస్యం చెప్పారు . ఈ జీవాయుధాల దాడితో కోట్ల మంది చనిపోతారని పేర్కొన్నారు.
  4. అణు విద్యుత్ ప్లాంట్‌లో త్వరలో పేలుడు జరుగుతుందని బాబా వంగా హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఇక్కడ.. ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌ను రష్యా ఆక్రమించుకోవడంతో ఈ అంచనా కూడా నిజం అవుతుందేమో అనే ఆలోచన చాలామందిలో కలుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. 2023లో.. ప్రపంచ పాలకులు ఎలాంటి వ్యక్తులు జన్మించాలో కూడా నిర్ణయిస్తారు. మనిషి లక్షణాలను,  రూపాన్ని కూడా నిర్ణయిస్తారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గుముఖం పడుతుంది. దీంతో ప్రభుత్వ పాలకులు జనన ఎంపికకు అనుకూలంగా చర్యలు తీసుకుంటారు.
  7.  బాబా వంగా 2023 లో రానున్న విపత్తుల గురించి వేసిన అంచనాలు 68శాతం నిజమయ్యే అవకాశం ఉందని బ్రిటీష్ వార్తాపత్రిక, ‘ది మిర్రర్’ నిర్దారించింది.

తర్వాత ఏం జరుగుతుంది? 2023గురించి మాత్రమే కాదు.. రానున్న  5 సంవత్సరాల్లో ఏర్పడనున్న పరిస్థితులను బాబా వంగా అంచనా వేశారు. ముఖ్యమైన అంచనాలు ఏమిటంటే.. 2025లో యూరప్ దాదాపు కనుమరుగవుతుందని పేర్కొన్నది. అంతేకాదు 2028లో కొత్త శక్తి వనరులను కనుగొనాలనే ఆశతో మనిషి శుక్రుడి వైపు ప్రయాణిస్తాడు.

తాము దైవం కొలిచే బాబా వెంగా చెప్పిన భవిష్యత్ వాణి తప్పకుండ జరుగుతుందని ఆమె శిష్యులు ఢంకా భజాయించి చెబుతున్నారు. బాబా వెంగా 1996 లోనే చనిపోయారు. కంటి చూపు లేని ఆమె రానున్న భవిష్యత్‌ లో ఏం జరుగబోతుందన్న విషయంపై ఆమె శిష్యులకు చెప్పారు. బాబా వెంగా భవిష్యవాణి ఇప్పటికి పుస్తకరూపంలో ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..