Train Ticket: పాక్ నుంచి భారత్‌కు వచ్చిన 1947 నాటి రైల్వే టికెట్.. అరుదైన ఫోటోను మ్యూజియంలో పెట్టాలని డిమాండ్..

1947 నాటి రైలు టిక్కెట్ ధరకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఈ టికెట్ పాకిస్తాన్ నుండి భారతదేశానికి వస్తున్న సమయంలోనిది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 17 సెప్టెంబర్ 1947న జారీ చేయబడింది.

Train Ticket: పాక్ నుంచి భారత్‌కు వచ్చిన 1947 నాటి రైల్వే టికెట్.. అరుదైన  ఫోటోను మ్యూజియంలో పెట్టాలని డిమాండ్..
Railway Ticket Cost
Follow us
Surya Kala

|

Updated on: Jan 31, 2023 | 9:19 AM

వివిధ విషయాలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఒక్కోసారి వినోదానికి సంబంధించినవి అయితే.. మరికొన్ని వింతలూ, విశేషాలు అయితే.. మరికొన్ని ప్రజలకు ఉపయోగపడేవి ఉంటాయి. ప్రజల జీవన విధానం గురించి కొంత సమాచారం కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైకిల్, బైక్, కారు.. రైలు ఇలా ఎన్ని రకాల ప్రయాణ వాహనాలున్నా.. ఎక్కువమంది ఇష్టపడే ప్రయాణం రైలు ప్రయాణం. చాలా సౌకర్యవంతంగా ఉండడమే కాదు.. అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సామాన్యుల నుంచి ధన వంతుల వరకూ రైతుల్లో ప్రయాణం చేసే విధంగా వివిధ టికెట్ ధరలుంటాయి.  రైలు టిక్కెట్టు ఛార్జీలు కాలక్రమేణా పెరుగుతున్నప్పటికీ..  1947 లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు రైలు టిక్కెట్ ధర ఎంత ఉందో మీకు తెలుసా? ప్రస్తుతం వైరల్‌గా మారుతున్న  ఒక ఫోటోలో అప్పటి ట్రైన్ టికెట్ ధర కనిపించి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

1947 నాటి రైలు టిక్కెట్ ధరకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఈ టికెట్ పాకిస్తాన్ నుండి భారతదేశానికి వస్తున్న సమయంలోనిది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 17 సెప్టెంబర్ 1947న జారీ చేయబడింది. ఈ టికెట్‌పై మొత్తం 9 మంది పాకిస్తాన్‌లోని రావల్పిండి నుండి భారతదేశంలోని అమృత్‌సర్‌కు చేరుకున్నారు. ఇందుకోసం ఒకొక్కరు రైలు టికెట్ ను కొనుగోలు చేసింది. కేవలం రూ. 4 లు మాత్రమే అని తెలుస్తోంది.  ఒక్కొక్కరికి పాకిస్తాన్ నుంచి భారత్ కు చేరుకోవడానికి ఛార్జీ దాదాపు 4 రూపాయలు అయింది. నేటి కాలంలో 36 రూపాయలకు లీటరు పాలు కూడా కూడా దొరకని పరిస్థితి. అయితే అప్పట్లో పాకిస్థాన్ నుంచి ఇంత తక్కువ మొత్తంలో 9 మంది భారత్‌కు వచ్చారు.

 గతంలోని  రైల్వే టిక్కెట్‌ను చూడండి

ఇవి కూడా చదవండి

ఈ చారిత్రాత్మక రైలు టిక్కెట్టు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్‌బుక్‌లో పాకిస్తాన్ రైల్ లవర్స్ అనే పేరుతో షేర్ చేయబడింది. క్యాప్షన్  ‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, 17 సెప్టెంబర్ 1947న, రావల్పిండి నుండి అమృత్‌సర్‌కు 9 మంది ప్రయాణించడానికి రైళ్లు టికెట్ ను అధికారులు ఇచ్చినది అని పేర్కొన్నారు. ఆ ఫొటోలో మొత్తం ధర రూ. 36. 9 అణాలు. బహుశా ఈ టికెట్ అప్పట్లో పాక్ నుంచి భారత్ కు వలస వచ్చిన ఓకే కుటుంబానికి సంబంధించినది అయి ఉండొచ్చు.

ఈ పోస్ట్ ను వేలాది మంది లైక్, విభిన్న కామెంట్స్ చేశారు. ‘ఈ టిక్కెట్‌ను ఎవరు భద్రపరిచినా.. ఎంతో విలువైన వారసత్వ సంపదను కాపాడుకున్నట్లే’ అని ఓ యూజర్ రాస్తే, ‘ఇది చాలా అరుదైన టికెట్. ఇప్పటి వరకు ఉంచడం చాలా పెద్ద విషయం. ప్రతి ఒక్కరూ ఈ వారసత్వాన్ని చూసేలా ఈ టికెట్ ను మ్యూజియంలో ఉంచాలి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..