AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: ఫలారంగా మారిన అలారం.. నోటిదూలతో ప్రాణాలు కోల్పోయిన పుంజు.. వైరల్ అవుతున్న వీడియో ..

నోటిదూల మహా ప్రమాదం అని మనం వినే ఉంటాం. అలాంటి నోటిదూలతోనే నిండు  ప్రాణాన్ని కోల్పోయింది ఓ అమాయకపు కోడిపుంజు. దానికి సంబంధించిన వీడియో

Trending Video: ఫలారంగా మారిన అలారం.. నోటిదూలతో ప్రాణాలు కోల్పోయిన పుంజు.. వైరల్ అవుతున్న వీడియో ..
Clucking Hen Which Become Chicken Recipe
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 31, 2023 | 10:15 AM

నోటిదూల మహా ప్రమాదం అని మనం వినే ఉంటాం. అలాంటి నోటిదూలతోనే నిండు  ప్రాణాన్ని కోల్పోయింది ఓ అమాయకపు కోడిపుంజు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు కూడా. ఇక ఇప్పుడంటే నిద్ర లేవడానికి మనం అలారం ఉపయోగిస్తున్నారు. కానీ ఒకప్పుడు అందరూ కూడా కోడి కూతల మీదనే ఆధారపడవలసి ఉండేది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ కోడి ఇంటి బయట ఉండి అరిస్తేనే దాన్ని నానా బూతులు తిట్టుకుంటూ నిద్రలేస్తుంటాం కదా మనందరం..  మరి అదే కోడి తనకు భూమి మీద నూకలు చెల్లాయని తెలియక, వచ్చి వచ్చి మన చెవిలో కోడి కూత కూస్తే ఎలా ఉంటది..? ఎక్కడా లేని కోపం చిర్రెత్తుకొస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కూడా అదే జరిగింది.

ఆ వీడియోలో నిద్రిస్తున్న వ్యక్తిని లేపడానికి పని మంతుడిలా వస్తున్న కోడిపుంజును మనం చూడవచ్చు. అలా వచ్చిన కోడి నిద్రిస్తున్న వ్యక్తి చెవి దగ్గరకు వెళ్లి దాని బుద్ధి చూపించుకునే ప్రయత్నంలో ఒక కూత కూసింది. సీన్ కట్ చేస్తే ఏముంది..? చికెన్ కర్రీలా మరిపోయింది. దీనికి సంబంధించిన వీడయో Mirchi Rj Gordon అనే ఫేస్‌బుక్ ఖాతా నుంచి పోస్ట్ అయింది. 

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోను ఇప్పటివరకు 13 లక్షలకు పైగా వీక్షణలు.. 30 వేలకు పైగా లైకులు వచ్చాయి. అలాగే వీడియోను చూసిన నెటిజన్లు విపరీతంగా నవ్వేసుకోవడంతో పాటు ‘చాలా బాధాకరం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘అలారం కాస్త ఫలారం అయ్యింది పాపం’ అని రాసుకొచ్చాడు. మీరు నవ్వేయాలి అనుకుంటే ఈ వీడియోను ఓ సారి తప్పక చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..