Turkey Earthquake: టర్కీలో మళ్లీ భూ ప్రకంపనలు.. టర్కీ, సిరియాలకు భారత్‌ ఆపన్న హస్తం..

NDRF టీమ్‌ ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్‌ స్క్వాడ్‌తో పాటు అవసరమైన పరికరాలతో స్పెషల్‌ ఫ్లైట్‌ టర్కీకి వెళ్తోంది. ఘజియాబాద్‌లో హిండన్‌ ఎయిర్‌బేస్‌ నుంచి ఫస్ట్‌ ఫ్లైట్‌ భూకంప బాధిత ప్రాంతాలకు బయలుదేరింది.

Turkey Earthquake: టర్కీలో మళ్లీ భూ ప్రకంపనలు.. టర్కీ, సిరియాలకు భారత్‌ ఆపన్న హస్తం..
Earthquake In Turkey
Follow us
Surya Kala

|

Updated on: Feb 07, 2023 | 11:12 AM

టర్కీలో నేడు మళ్లీ భూకంపం ఏర్పడింది. మంగళవారం సెంట్రల్ టర్కీ ప్రాంతంలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. సోమవారం నుంచి నేటి వరకూ వరుస భూకంపాలతో టర్కీ, సిరియా విలవిలలాడుతోంది. ఎక్కడ చూసినా హృదయవిదారక ఘటనలే కనిపిస్తున్నాయి. బాధిత దేశాలైన టర్కీ, సిరియాలకు ఆపన్న హస్తం అందిస్తోంది భారత్‌. విపత్కర పరిస్థితుల్లో ఆయా దేశాలకు అండగా నిలుస్తోంది. NDRF టీమ్‌ ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్‌ స్క్వాడ్‌తో పాటు అవసరమైన పరికరాలతో స్పెషల్‌ ఫ్లైట్‌ టర్కీకి వెళ్తోంది. ఘజియాబాద్‌లో హిండన్‌ ఎయిర్‌బేస్‌ నుంచి ఫస్ట్‌ ఫ్లైట్‌ భూకంప బాధిత ప్రాంతాలకు బయలుదేరింది.

4,000 మందికి పైగా మరణించిన గంటల తర్వాత,  . ఇంకా వేలాది మంది గాయపడ్డారు మరియు ప్రాణాలతో బయటపడిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. భారతదేశంతో సహా అనేక దేశాలు సామాగ్రి మరియు సహాయక బృందాలను పంపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

47మంది NDRF టీమ్‌తో పాటు, సీనియర్‌ అధికారులు, పారామెడికల్‌ సిబ్బంది కూడా ఈ ఫ్లైట్‌లో ఉన్నారు. ఇక సెకండ్‌ టీమ్‌ మరికాసేపట్లో బయలుదేరుతుంది. వీరంతా భూకంప బాధిత ప్రాంతాల్లో వారికి సాయం అందించనున్నారు.

టర్కీ, సిరియాల్లో పెను విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఆ రెండు దేశాలకు అండగా ఉంటామని..అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు. ఇవాళ స్పెషల్‌ ఫ్లైట్స్‌లో ఫుడ్, మెడిసిన్స్‌, ఇతర పరికరాలను తరలిస్తున్నారు.

మరోవైపు టర్కీ, సిరియాలకు సాయమందించడానికి 45 దేశాలు ముందుకొచ్చాయి. సహాయక చర్యల కోసం గాలింపు బృందాలు, వైద్య సామాగ్రిని పంపనున్నట్టు ప్రకటించాయి. అమెరికా, రష్యా, జర్మనీ, తైవాన్ సహా అనేక దేశాలు అండగా నిలుస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?