Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turkey Viral Pic: శిథిలాల కింద యజమాని కోసం రోదిస్తోన్న శునకం.. వైరల్ ఫోటో వెనుక కథ ఏమిటంటే

భూకంపం మిగిల్చిన విషాదానికి టర్కీ కన్నీరుపెడుతోంది. ప్రమాదం దాటికి గుక్కపట్టి ఏడుస్తోంది. పేకమేడల్లా పెద్ద పెద్ద భవనాలు కూలుతున్న సమయంలో తమ పిల్లలు, కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు అక్కడి జనం చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు.

Turkey Viral Pic: శిథిలాల కింద యజమాని కోసం రోదిస్తోన్న శునకం.. వైరల్ ఫోటో వెనుక కథ ఏమిటంటే
Turkey Viral Pic
Follow us
Surya Kala

|

Updated on: Feb 08, 2023 | 12:44 PM

ప్రకృతి ఎప్పుడు ఎలా ఏ విధంగా మానవ జీవితాలను ఛిద్రం చేస్తుందో ప్రపంచంలో ఏ నరుడికి తెలియదు.. ప్రళయం వస్తుందని అంచనా మాత్రమే వేయగలరు.. అది సృష్టించే విధ్వంసం నుంచి తప్పించుకోవడం మానవమాత్రుల వల్ల కాదు.. ఇదే విషయాన్నీ సునామీ, తుఫాన్, భూకంపం వంటి ప్రకృతి సృష్టించిన విలయాలు తెలియజేస్తూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం వరకూ ఆకాశాన్ని తాకుతూ ఠీవిగా నిలబడిన అపార్ట్‌మెంట్‌లు ఇప్పుడు నేలకూలాయి. ప్రజలు నిద్రిస్తున్న సమయంలో 7.8-తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. దీంతో తినడానికి తిండలేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, ఇంటర్నెట్‌ నిలిచిపోయింది. మొత్తంగా టర్కీ విలవిలలాడుతోంది. ఎన్నడూ చూడని విపత్తును ఎదుర్కోంటోంది టర్కీ. వరస భూ ప్రకంపనలతో వేలాది భవనాలు కుప్పకూలాయి. భారీ సంఖ్యలో శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారు.  మిలియన్ల మంది జీవితాలు ప్రభావితమయ్యాయి.

దీంతో రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగింది. సైజు శిథిలం కింద పడి ఉన్న బాధితులను వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నది. శిధిలాల కింద ఉన్న యువకుడ్ని గమనించి చాకచాక్యంగా బయటకు తీశారు. టర్కీ ప్రమాదంలో ఇలాంటి విషాద దృశ్యాలు ఒక్కటా, రెండా? చెప్పుకుంటూపోతే వందల సంఖ్యలో ఉన్నాయి.

ఈ ఘటనలు కేవలం మచ్చుతునకలే, కనిపించని వ్యథలు అనేకం ఉన్నాయి. భూకంపం మిగిల్చిన విషాదానికి టర్కీ కన్నీరుపెడుతోంది. ప్రమాదం దాటికి గుక్కపట్టి ఏడుస్తోంది. పేకమేడల్లా పెద్ద పెద్ద భవనాలు కూలుతున్న సమయంలో తమ పిల్లలు, కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు అక్కడి జనం చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. రక్తపు మడుగుల్లో నిండిన వారిని చేతులపైనే ఎత్తుకొని పోయి రక్షించుకున్నారు అక్కడి జనం. మృతుల్లో పిల్లలు, మహిళలే ఎక్కువ. హాహాకారాలు.. ఆర్తనాదాలు.. కన్నీటి వ్యథలు. మొత్తంగా టర్కీ భూకంపం ధాటికి చెల్లాచెదురైపోయింది. బాధిత ప్రాంతాల్లోని ప్రజలు తమవారిని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయామంటూ కన్నీరు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ ఫొటోలో నిజం ఎంత?

టర్కీ లో భూకంప బాధితులు అంటూ అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వాటిల్లో ఒకటి అందరి హృదయాలను కదిలిస్తోంది. అదే యజమాని కోసం కన్నీరు పెడుతున్న శునకాన్ని సంబంధించింది. అవును ప్రతీ రోజు ఆలనాపాలనా చూసే మనిషి ప్రమాదంలో పడడంతో రక్షించండి అంటూ మూగ భాషలో శునకం రోధిస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే.. అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం, ఈ ఫోటో చెక్ రిపబ్లిక్కి చెందినది. ఈ ఫోటో మొదట జనవరి 4, 2019న పోస్ట్ చేయబడింది. ఐతే ఈ ఫోటోకి టర్కీ భూకంపానికి ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..