ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు, కారు.. 30 మంది దుర్మరణం
ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది.. అనంతరం రెండు వాహనాలు లోయలో పడిపోవడంతో 30 మంది దుర్మరణం చెందారు.
Pakistan Accident: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది.. అనంతరం రెండు వాహనాలు లోయలో పడిపోవడంతో 30 మంది దుర్మరణం చెందారు. మరో 15 మందికి తీవ్రయాలయ్యాయి. ఈ దుర్ఘటన వాయువ్య పాకిస్థాన్‌లో మంగళవారం రాత్రి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో 30 మంది మరణించగా.. అనేకమంది గాయాలపాలయ్యారని పేర్కొన్నారు.
ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కోహిస్థాన్ జిల్లాలోని కారకోరం హైవేపై మంగళవారం రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని లోయలోకి పడిపోయాయి. షిటియాల్ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న కారును గిల్గిట్ నుంచి రావల్పిండికి వెళ్తున్న ప్రయాణీకుల బస్సు ఢీకొట్టింది. అనంతరం రెండూ లోయలో పడిపోయాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చీకటిగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి పాకిస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..