AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turkey Earthquake: తవ్వే కొద్దీ బయటపడుతున్న శవాలు.. 23వేల మంది మృతి.. 20 ఏళ్ల తర్వాత భారీ విపత్తు.. రెండు కోట్లమందిపై ప్రభావం

శిథిలాలు తవ్వుతున్నకొద్దీ, బయటపడుతున్న మృతదేహాలను సామూహికంగా సమాధి చేస్తున్నారు. 1990 తర్వాత ఇంత పెద్ద విపత్తు ఇప్పుడే సంభవించింది. భూకంపంతో ఇంతమంది చనిపోవడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అంటున్నారు.

Turkey Earthquake: తవ్వే కొద్దీ బయటపడుతున్న శవాలు.. 23వేల మంది మృతి.. 20 ఏళ్ల తర్వాత భారీ విపత్తు.. రెండు కోట్లమందిపై ప్రభావం
Turkey Earthquake
Surya Kala
|

Updated on: Feb 11, 2023 | 7:09 AM

Share

భూకంపం వచ్చి ఆరు రోజులైనా.. ఇంకా టర్కీ, సిరియాలో హృదయ విదారక పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలు.. సామూహిక ఖననాలు.. బాధితుల రోదనలు.. వేలాది మంది శిథిలాల కింద సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యలు ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు. కానీ శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతుంటడం అత్యంత బాధ కలిగిస్తోంది. శిథిలాలను తవ్వేకొద్దీ శవాలు.. అయినవారిని పోగొట్టుకున్న వారి ఆర్తానాదాలతో.. టర్కీ, సిరియాలో పరిస్థితులు భీతావహంగా కనిపిస్తున్నాయి. భూకంపం ప్రభావంతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గంట గంటకూ.. పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 23వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక లెక్కలే చెప్తున్నాయి.

టర్కీలో 20,213 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించారు. మరో 77,711 మందికి పైగా గాయాలయ్యాయి. ఇక సిరియాలో 3,553 మంది మృతి చెందారు. శిథిలాలు తవ్వుతున్నకొద్దీ, బయటపడుతున్న మృతదేహాలను సామూహికంగా సమాధి చేస్తున్నారు. 1990 తర్వాత ఇంత పెద్ద విపత్తు ఇప్పుడే సంభవించింది. భూకంపంతో ఇంతమంది చనిపోవడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అంటున్నారు. సహాయక చర్యలు పూర్తయ్యే సరికి ఈ లెక్కలు ఎక్కడివరకూ వెళ్తాయో.. ఇంకెంత మంది ప్రాణాలు పోతాయో అనేది ఊహించడానికి భయం వేస్తోంది.

సిరియాలో సుమారు 5.3మిలియన్ మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారారు. టర్కీలోనూ లక్షలాది మంది గూడు కోల్పోయారు. 6 రోజులుగా రోడ్ల మీదే గడుపుతున్నారు. తిండీ, తిప్పలు లేక.. అయిన వారిని పోగొట్టుకుని.. తీవ్ర దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. వారి ధీన స్థితిని చూసి తట్టుకోలేని కొందరు రెస్టారెంటు ఓనర్లు.. ఆహారం అందిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికీ ఆహారం అందిస్తుంది వారే. నిరాశ్రయులుగా మారిన వారిని పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు.. అద్దె ఇళ్లను చూపించడం లాంటి కార్యక్రమాలను చేపట్టాయి అక్కడి ప్రభుత్వాలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే