పాకిస్థాన్-సదర్న్ ఆఫ్ఘనిస్తాన్ ని కలిపే కీలక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాం..తాలిబన్లు

పాకిస్తాన్ తో సదర్న్ ఆఫ్ఘనిస్తాన్ ని కలిపే కీలక ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘన్ దళాలు తమకు లొంగిపోయినట్టు వెల్లడించారు. పాకిస్తాన్ తో గల దురాండ్ లైన్ బోర్డర్ సమీపంలో..కాందహార్ రాష్ట్రంలోని 'స్పిన్ బోల్డాక్ జిల్లాగా దీన్ని వ్యవహరిస్తున్నారు.

పాకిస్థాన్-సదర్న్ ఆఫ్ఘనిస్తాన్ ని కలిపే కీలక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాం..తాలిబన్లు
Talibans
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jul 14, 2021 | 2:05 PM

పాకిస్తాన్ తో సదర్న్ ఆఫ్ఘనిస్తాన్ ని కలిపే కీలక ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘన్ దళాలు తమకు లొంగిపోయినట్టు వెల్లడించారు. పాకిస్తాన్ తో గల దురాండ్ లైన్ బోర్డర్ సమీపంలో..కాందహార్ రాష్ట్రంలోని ‘స్పిన్ బోల్డాక్ జిల్లాగా దీన్ని వ్యవహరిస్తున్నారు. ఇది తమ వశమైందని తాలిబన్ల ప్రతినిధి జహీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ ప్రాంతం అతి ముఖ్యమైన బోర్డర్ టౌన్ అని వెల్లడించారు. దీంతో ఈ సమీప ప్రాంతాలన్నీతమ హస్తగతమయ్యాయన్నారు. మొత్తానికి కాందహార్ కస్టమ్స్ ముజాహిదీన్ కంట్రోల్ లోకి వచ్చింది అంటూ ఇంకా ముందుకు సాగుతామన్నాడు. పాక్, ఆఫ్గనిస్తాన్, ఇరాన్, సెంట్రల్ ఆసియా దేశాలను కలిపే ఈ రోడ్డులో రోజూ దాదాపు 900 ట్రక్కులు ప్రయాణిస్తుంటాయి. కీలకమైన ఈ మార్గంలో ఇప్పుడు తాలిబన్లు కనిపిస్తున్నారు.

ఈ రోడ్డును గురించి ప్రభుత్వ డేటా ఈ విషయాన్ని వివరిస్తూ ఇక ఇక్కడ ఈ ట్రక్కుల రాకపోకలు తగ్గవచ్చునని వివరించింది. ఇటీవలి వారాల్లో హీరత్, ఫరా రాష్ట్రాల్లో కొన్ని అతి ముఖ్యమైన ప్రాంతాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని కాబూల్ లోని ఆఫ్ఘనిస్తాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ చైర్మన్ షఫీఖుల్లా అటాయ్ తెలిపారు. ఇక ఆఫ్ఘన్ లోని సుమారు 350 కి పైగా జిల్లాల్లో 170 జిల్లాలు దాదాపు తాలిబన్ల వశమైనట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పలు చోట్ల ఆఫ్ఘన్ దళాలు వారికి లొంగిపోతున్నట్టు తెలుస్తోంది. తమ సైనిక దళాలకు అవసరమైతే భారత సైన్య సహాయపడుతుందని ఆశిస్తున్నామని ఆఫ్ఘన్ రాయబారి పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ ఇది ఆఫ్ఘన్ భద్రతా దళాలకు శిక్షణ రూపంలో ఉండాలని ఆయన కోరాడు.

మరిన్ని ఇక్కడ చూడండి : మరింత ముందుగానే థర్డ్ వేవ్..?మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. :Corona 3rd Wave Live Video.

సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు జోరు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మెగాస్టార్..Megastar Chiranjeevi Video.

 Samsung Galaxy Video: అదిరిపోయే ఫీచర్లతో కొత్త డివైజ్‌లను విడుదల చేయనున్న సామ్‌సంగ్‌..(వీడియో).

 థర్డ్ వేవ్ షురూ.. మహారాష్ట్ర లో మళ్ళీ పుంజుకుంటున్న కోవిడ్ కేసులు..:Third Wave Of Corona Video.