AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Poison Garden: మనుషులను చంపే మొక్కలను చూశారా..? తాకితే ఇక అంతే..!

ఈ గార్డెన్‌లోని మొక్కలు విషాన్ని వెదజల్లుతాయి. అలాగే మరికొన్ని మొక్కలు చర్మాన్ని కాల్చివేస్తాయి. ఈ బొబ్బలు ఏడేళ్ల వరకు మానవంట. ఈ గార్డెన్‌లోకి వెళ్తే మూర్చ కూడా పోతారంట.

The Poison Garden: మనుషులను చంపే మొక్కలను చూశారా..? తాకితే ఇక అంతే..!
The Poison Garden
TV9 Telugu Digital Desk
| Edited By: Venkata Chari|

Updated on: Jul 14, 2021 | 3:06 PM

Share

The Poison Garden: మనం చాలా రకాల పార్కులు, గార్డెన్లు చూసే ఉంటాం. కానీ, మొదటిసారి ఈ గార్డెన్ గురంచి చెబితే కచ్చితంగా భయపడతారు. అలాంటి ఓ గార్డెన్‌ను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం. అసలు మనం మొక్కలు, చెట్లను నరికేసి వాటి ప్రాణాలు తీస్తాం. కానీ, మొక్కలు మనల్ని చంపేస్తాయని తెలుసా? అయితే మీరు తప్పకుండా ఇంగ్లండ్‌లోని ఈ గార్డెన్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. చచ్చిపోవాలని ఫిక్స్ అయిన వారే ఈ పార్క్‌కి వెళ్లే సాహసం చేయాల్సి ఉంటది. లేదు ఓసారి చూస్తాం అంటూ ఈ గార్డెన్‌లోకి వెళ్లి ఆ మొక్కలను ముట్టుకుంటే ఇక ఇబ్బందులు పడకుండా ఉండలేరు. లోపలికి వెళ్లి బయటకు వచ్చారంటే మాత్రం మీకు అదృష్టం వైఫైలా మీచుట్టూనే తిరుగుతందని అర్థం.

అసలు విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌లోని నార్తంబర్‌ల్యాండ్‌లోని ఉంది ఈ డేంజర్ గార్డెన్. దీని పేరు ఆల్న్‌విక్ గార్డెన్‌. ఇందులో చాలా విషపు మొక్కలు ఉన్నాయి. ‘వరల్డ్ డెడ్లియెస్ట్ గార్డెన్’గా దీనికి పేరుంది. ఈ పార్కులోకి వెళ్లాలంటే మాత్రం ప్రత్యేకకంగా ఓ గైడ్‌ను వెంట ఉండాల్సిందే. ఎవరైనా సరే ఈ గార్డెన్‌లో మొక్కలను ముట్టుకోకూడదు. ఒకవేళ మీ కర్మ కాలి ముట్టుకుంటే ఇక అంతే. వీటి నుంచి వచ్చే వాసనతో.. ఇంతకుముందు కొందరు సందర్శకులు మూర్చ కూడా పోయారంట. మరికొందరైతే అస్వస్థతకు గురయినట్లు గార్డెన్ యాజమాన్యం పేర్కొంది.

మరి ఇలాంటి గార్డెన్‌ను ఎందుకు ఏర్పాటు చేశారని అనుకుంటున్నారా? మనకు తెలియని చాలా మొక్కలు ఈ భూమిమీద ఉన్నాయి. వాటిలో చాలా వరకు మంచివే అయినా… మరికొన్ని మాత్రం చాలా డేంజర్ అంట. అందుకే ఇలాంటి విషపు మొక్కలు ప్రజలకు చూపించాలనే ఇలాంటి గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. ఈ గార్డెన్‌ను ఏర్పాటు చేసేప్పుడు మొదట్లో కేవలం ఔషధ మొక్కలను మాత్రమే పెంచుదామని అనుకున్నారంట. కానీ, అన్ని పార్కుల్లో ఇలాంటివి ఉంటాయని, కాస్త ఢిపరెంట్‌గా ట్రై చేశారంట. అయితే, ఈ గార్డెన్‌ను చూసేందుకు సందర్శకులు చాలామంది వస్తుండడంతో.. ప్రపంచానికి ఈ గార్డెన్ గురించి తెలిసింది. దీనిలోకి ప్రవేశించాలంటే మాత్రం హజ్మత్ సూట్లు ధరించాల్సిందేనంట.

గార్డెన్ నిర్వాహకులు ట్రెవర్ జోన్స్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఈ గార్డెన్‌లో ఉన్న మొక్కలన్ని సాధారణమైనవే. ఇవి చాలామంది ఇళ్లు, ఆఫీసులు, ఫాంహౌజ్‌లలో పెంచుకుంటూనే ఉంటారు. వారికి ఈ మొక్కలు ఎంత ప్రమాదకరమో తెలియదు. అందుకే వీటి గురించి తెలియజేయాలని నిర్ణయించుకున్నాం’’ అని పేర్కొన్నాడు.

పేరు ఆల్న్‌విక్ గార్డెన్‌‌లో దాదాపు 100 వరకు విషపూరిత మొక్కలు పెంచుతున్నారు. ఇందులో మాంక్‌షుడ్ అనే మొక్క మాత్రం చాలా డేంజర్ అంట. ఈ మొక్క నీలం రంగు పువ్వులు పూస్తుంది. ఇక కాయలు, ఆకులు, కాండం మనల్ని డేంజర్ జోన్‌లో పడేస్తాయంట. అలాగే ఈ గార్డెన్‌‌లో కొన్ని మొక్కలు విషాన్ని వెదజల్లుతాయి. మరో మొక్క ఫొటో‌టాక్సిక్ వల్ల మన చర్మం కాలిపోయేలా చేస్తుంది. ఈ బొబ్బలు కనీసం ఏడేళ్ల వరకు కూడా తగ్గవంట. చూశారుగా ఈ మొక్కలు ఎంత డేజంరో.

Also Read:

పాకిస్థాన్-సదర్న్ ఆఫ్ఘనిస్తాన్ ని కలిపే కీలక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాం..తాలిబన్లు