Airport: విమానాశ్రయంలో తనిఖీలు..ప్రయాణికుడి లంచ్‌బాక్స్‌లో ఆహారాన్ని చూసి షాక్‌.. రూ.5 లక్షల జరిమానా

ప్రపంచంలోని చాలా ప్రదేశాలలో ప్రజలు ఇలాంటి వింతలను చూస్తుంటారు. వాటిని చూడడమే కాదు, వారి పేరు వింటేనే వికారంగా అనిపిస్తుంది. మాంసం, చేపలు తినడం సాధారణం. అయితే ఎవరైనా పాములు, తేళ్లు వంటి ప్రమాదకరమైన జీవులను కూడా తింటుంటారు. కానీ నిషేధించిన పదార్థాలతో పట్టుబడితే చర్యలు కఠినంగానే ఉంటాయి. ఇండోనేషియాకు చెందిన ఒక వ్యక్తి తైవాన్‌లో నిషేధించబడిన తన లంచ్‌బాక్స్‌లో ఆహార పదార్థాన్ని..

Airport: విమానాశ్రయంలో తనిఖీలు..ప్రయాణికుడి లంచ్‌బాక్స్‌లో ఆహారాన్ని చూసి షాక్‌.. రూ.5 లక్షల జరిమానా
Flight
Follow us
Subhash Goud

|

Updated on: May 28, 2024 | 9:26 PM

ప్రపంచంలోని చాలా ప్రదేశాలలో ప్రజలు ఇలాంటి వింతలను చూస్తుంటారు. వాటిని చూడడమే కాదు, వారి పేరు వింటేనే వికారంగా అనిపిస్తుంది. మాంసం, చేపలు తినడం సాధారణం. అయితే ఎవరైనా పాములు, తేళ్లు వంటి ప్రమాదకరమైన జీవులను కూడా తింటుంటారు. కానీ నిషేధించిన పదార్థాలతో పట్టుబడితే చర్యలు కఠినంగానే ఉంటాయి. ఇండోనేషియాకు చెందిన ఒక వ్యక్తి తైవాన్‌లో నిషేధించబడిన తన లంచ్‌బాక్స్‌లో ఆహార పదార్థాన్ని తీసుకువెళుతుండగా పట్టుబడ్డాడు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, అతను విమానంలో ప్రయాణించేందుకు హాంకాంగ్ నుండి తైవాన్‌కు వెళుతున్నాడు. ఎయిర్‌పోర్టులో అధికారులు అతని లంచ్‌బాక్స్‌ను చెక్‌ చేయగా, అందులో కాల్చిన పంది మాంసాన్ని గుర్తించారు. దీంతో అతనికి సుమారు $6,200 (రూ.5 లక్షలు)కు పైగా జరిమానా విధించారు అధికారులు. జరిమానా కూడా వెంటనే చెల్లించాలని ఆదేశించారు.

జరిమానా చెల్లించిన తర్వాతే ప్రవేశం:

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఆ వ్యక్తి జరిమానాను వెంటనే చెల్లించలేదు. దాని కారణంగా అతన్ని హాంకాంగ్‌కు తిరిగి పంపారు. భవిష్యత్తులో అలాంటి తప్పు చేయకూడదని ఆదేశించారు. జరిమానా చెల్లించిన తర్వాత మాత్రమే తైవాన్‌లోకి ప్రవేశించవచ్చని సూచించారు. ప్రయాణీకుడు ఏప్రిల్ 30న తైపీకి వచ్చాడని, అతని లంచ్‌బాక్స్‌లో కాంటోనీస్ తరహా కాల్చిన మాంసం ఉందని వార్తా సంస్థలు గత ఆదివారం నివేదించాయి.

ఇవి కూడా చదవండి

కస్టమ్స్ అధికారులు జరిమానా విధించారు

ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఒక ఫోటో భోజనంలో కాల్చిన పంది మాంసం, అన్నంతో పాటు సోయా సాస్ చికెన్‌లు ఉన్నాయని వెల్లడించింది. ఇవి రెండూ సాధారణ కాంటోనీస్ వంటకాలు. వ్యక్తి విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న కస్టమ్స్ విభాగానికి చెందిన కుక్క మాంసం వాసన చూడటంతో అధికారులకు సమాచారం అందించింది. ఆ తర్వాత జరిమానా విధించారు.

జరిమానా ఎందుకు విధించారు?

వాస్తవానికి 2018 నుండి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు కనుగొన్న ప్రాంతాల నుండి పంది మాంసం దిగుమతిపై తైవాన్ అధికారులు కఠినమైన నియంత్రణలను విధించారు. ఎవరైనా మొదటిసారి ఈ నేరం చేస్తూ పట్టుబడితే, జరిమానా రూ. 5 లక్షలు, మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తే జరిమానాను ఒక మిలియన్ తైవాన్ డాలర్లకు పెంచవచ్చు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి