Israel – Gaza: ఏ శక్తీ తమను ఆపలేదన్న ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం.

దక్షిణ గాజాలోని పాలస్తీనీయులపై ఇజ్రాయెల్‌ మారణహోమానికి పాల్పడుతోందంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు చెప్పింది. గాజాపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. గాజాకు మానవతాసాయం అందేలా ఈజిప్ట్-గాజా సరిహద్దును కూడా తెరవాలని పేర్కొంది.గాజాలో ఇజ్రాయెల్‌ నరమేధానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ దక్షిణాఫ్రికా వేసిన పిటిషన్‌పై శుక్రవారం 15 మంది న్యాయమూర్తుల..

Israel - Gaza: ఏ శక్తీ తమను ఆపలేదన్న ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం.

|

Updated on: May 28, 2024 | 4:57 PM

దక్షిణ గాజాలోని పాలస్తీనీయులపై ఇజ్రాయెల్‌ మారణహోమానికి పాల్పడుతోందంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు చెప్పింది. గాజాపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. గాజాకు మానవతాసాయం అందేలా ఈజిప్ట్-గాజా సరిహద్దును కూడా తెరవాలని పేర్కొంది. గాజాలో ఇజ్రాయెల్‌ నరమేధానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ దక్షిణాఫ్రికా వేసిన పిటిషన్‌పై శుక్రవారం 15 మంది న్యాయమూర్తుల ఐసీజే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పాలస్తీనాలో పరిస్థితులు క్షీణించిపోయాయని, వాటిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఇజ్రాయెల్‌ను ఆదేశించినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రఫా ప్రభుత్వానికి ఆటంకం కలిగేలా ఇజ్రాయెల్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. మానవతా దృక్పథంతో ఈజిప్ట్‌-గాజా సరిహద్దును కూడా తెరవాలని, అలాగే దీని పురోగతిపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంది. అయితే గాజా నుంచి పూర్తిగా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్‌కు ఆదేశాలివ్వాలని దక్షిణాఫ్రికా చేసిన వినతికి ఐసీజే అధ్యక్షుడు జడ్జి నవాఫ్ సలామ్ సానుకూలంగా స్పందించలేదు. కాల్పుల విరమణ ఆదేశాలివ్వాలంటూ చేసిన విజ్ఞప్తినీ తిరిస్కరించారు.

మరోవైపు అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఇజ్రాయెల్ ఖండించింది. తన పౌరులను రక్షించకుండా, గాజాలో హమాస్‌ ఉగ్రవాదులను నిరోధించకుండా ఈ భూమిపై ఏ శక్తీ తమని ఆపలేదని ఇజ్రాయెల్ వ్యాఖ్యానించింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు హమాస్ నేతలపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఐసీసీ చీఫ్ చేసిన అభ్యర్థనలకు యూఎస్ సెనేటర్ బెర్నీ శాండర్స్ మద్దతు ఇచ్చారు. ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ అమలు జరగవచ్చు, జరగకపోవచ్చుననీ సమాజం అంతర్జాతీయ చట్టాలను పాటించాలనీ అన్నారు. కానీ నైతిక విలువలు పాటించనప్పుడు ప్రపంచం యుద్ధాలతో నిండిపోతుంది అని శాండర్స్ అన్నారు. అరెస్ట్ వారెంట్లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా వ్యతిరేకించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles