Supreme Court: పోలీస్ స్టేషన్ లలో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
పోలీస్ స్టేషన్ లలో సీసీ కెమెరాల విషయంలో సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
పోలీస్ స్టేషన్ లలో సీసీ కెమెరాల విషయంలో సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అధికారం ఉన్నవారికి.. డబ్బులు ఉన్నవారికి పోలీసులు కొమ్ముకాస్తూ.. సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలతో యాక్షన్ తీసుకుంది సుప్రీం.
కొన్ని పీఎస్ లు ఏకంగా సెటిల్మెంట్ కు అడ్డాగా మారుతున్నాయని.. లాకప్ డెత్, బెదిరింపులు, వసూళ్లు, అక్రమార్కులకు అండదండగా ఉంటున్నారనే ఆరోపణలతో పోలీస్ వ్యవస్థ పై నమ్మకం లేని పరిస్థితి నెలకొందని పేర్కొంది సుప్రీం. కొన్ని స్టేషన్‌లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరుగుతున్నాయనే ఆరోపణలను సుప్రీం సీరియస్ గా తీసుకుంది. పీఎస్ లలో జరిగేది ప్రతీదీ పారదర్శకంగా ఉండాలనే ఉద్ధేశంతో, సామాన్యులకు న్యాయం జరగాలనే యోచనతో పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల విషయంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తీరాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంలో ఆయా రాష్ట్రాల సీఎస్ లు చర్యలు తీసుకోవాలని చెప్పింది. దీనికి సంబంధించి పనులు ఎంత వరకూ జరిగాయో తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలంది. పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవాలని హెచ్చరించింది సుప్రీంకోర్టు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.