Pakistan: కార్గిల్ యుద్ధం పాపం మాదే.. 25 ఏళ్ల తర్వాత తప్పును అంగీకరించిన పాక్ మాజీ ప్రధాని

క్షవరం అయితే గాని వివరం రాదు అని పెద్దలు చెప్పిన మాటలకు సజీవ సాక్ష్యం నేటి పాకిస్తాన్ నేతల తీరు. అఖండ భారత దేశం నుంచి విడిపోయినపట్టి నుంచి సోదర సమానమైన భారతదేశంతో స్నేహ సంబంధాలను పెంచుకోవడం పక్కకు పెట్టి.. ద్వేషాన్ని అణువణువుని నింపుకుని నిరాతరం భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనే విధంగా నడుచుకుంటూనే ఉంది. అయితే తాజాగా పాకిస్తాన్ అధికారుల తీరుపై పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pakistan: కార్గిల్ యుద్ధం పాపం మాదే.. 25 ఏళ్ల తర్వాత తప్పును అంగీకరించిన పాక్ మాజీ ప్రధాని
Lahore Declaration
Follow us
Surya Kala

|

Updated on: May 29, 2024 | 7:26 AM

క్షవరం అయితే గాని వివరం రాదు అని పెద్దలు చెప్పిన మాటలకు సజీవ సాక్ష్యం నేటి పాకిస్తాన్ నేతల తీరు. అఖండ భారత దేశం నుంచి విడిపోయినపట్టి నుంచి సోదర సమానమైన భారతదేశంతో స్నేహ సంబంధాలను పెంచుకోవడం పక్కకు పెట్టి.. ద్వేషాన్ని అణువణువుని నింపుకుని నిరాతరం భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనే విధంగా నడుచుకుంటూనే ఉంది. అయితే తాజాగా పాకిస్తాన్ అధికారుల తీరుపై పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1999లో తాను, మాజీ ప్రధాని అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి.. భారత్‌తో చేసుకున్న ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని మంగళవారం స్వయంగా వెల్లడించారు. తాము చేసింది తప్పే అని అంగీకరించారు. కార్గిల్‌లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ జరిపిన దాడి గురించి కూడా మాజీ ప్రధాని ఈ సమయంలో చెప్పారు.

పాకిస్థాన్ అణుపరీక్షలు జరిపి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పీఎంఎల్-ఎన్ సమావేశంలో ప్రజలనుద్దేశించి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడారు. ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ 1999 నాటి లాహోర్ డిక్లరేషన్ గురించి ప్రస్తావించారు. మే 28, 1998న పాకిస్థాన్ ఐదుసార్లు అణుపరీక్షలు నిర్వహించిందని.. అనంతరం అప్పటి మాజీ ప్రధాని వాజ్‌పేయి పాక్ తో లాహోర్ డిక్లరేషన్ కుదుర్చుకున్నారు. లాహోర్ ఒప్పందంపై సంతకాలు చేశామని నవాజ్ షరీఫ్ చెప్పారు. అయితే ఆ ఒప్పందాన్ని మనం ఉల్లంఘించాం అని ముమ్మాటికి మన తప్పే అంటూ నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను పాక్ ప్రభుత్వ ఛానల్ ప్రసారం చేసింది. రెండు దేశాల మధ్య శాంతి, సుస్థిరతకు సంబంధించిన దృక్పథం గురించి మాట్లాడే ఈ ఒప్పందం పెద్ద విజయాన్ని సాధించింది. ఆ వాగ్దానానికి విరుద్ధంగా వెళ్లాం అనేది వేరే విషయం. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు పాకిస్థాన్ దోషి అంటూ ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

భారత్‌తో ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది.

ఈ ఒప్పందం జరిగిన కొద్ది నెలలకే నవాజ్ షరీఫ్ జమ్మూకశ్మీర్‌లో కార్గిల్ జిల్లాలో చొరబాట్లకు తెరతీశారు. 1999లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ యుద్ధానికి కారణం అయ్యారని.. అలా తాను, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంతకం చేసిన ఒప్పందాన్ని ఇస్లామాబాద్ ఉల్లంఘించిందని అన్నారు. ఒప్పందం జరిగిన కొద్ది నెలలకే కార్గిల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాక్ ఓటమి చవి చూసింది.

‘అణు పరీక్షలను ఆపేందుకు 5 బిలియన్ డాలర్లు ఆఫర్’

అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్తాన్ అణుపరీక్షలు నిర్వహించకుండా పాకిస్థాన్‌కు ఏటా 5 బిలియన్ అమెరికన్ డాలర్లు ఇస్తామని ఆశ చూపినట్లు.. అయితే తాను ఈ ఆఫర్ ను తిరస్కరించినట్లు షరీఫ్ చెప్పారు. తన స్థానంలో (మాజీ ప్రధాని) ఇమ్రాన్ ఖాన్ లాంటి వ్యక్తి ఉండి ఉంటే క్లింటన్ ప్రతిపాదనను వెంటనే అంగీకరించేవారు అంటూ నవాజ్ అభిప్రాయపడ్డారు.

ఇంకా.. 72 ఏళ్ల నవాజ్ షరీఫ్ 2017లో అప్పటి పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ సాకిబ్ నిసార్ తనని తప్పుడు కేసులో ఇరికించి ప్రధాని పదవి నుంచి ఎలా తొలగించారో కూడా చెప్పారు. తనపై ఉన్న కేసులన్నీ అవాస్తవమని.. అయితే పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపక నేత ఇమ్రాన్ ఖాన్‌పై కేసులు నిజమేనని అన్నారు.

తమ్ముడు షాబాజ్ షరీఫ్‌పై ప్రశంసలు తన తమ్ముడు పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌పై కూడా నవాజ్ షరీఫ్ ప్రశంసలు కురిపించారు. ప్రతి బ్యాడ్ టైంలో షరీఫ్ తనకు అండగా నిలిచారని అన్నారు. మా మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం జరిగింది. అయితే షాబాజ్ తనకు విధేయుడిగానే ఉన్నాడు. గతంలో షెహబాజ్‌ను ప్రధాని అయ్యి నన్ను విడిచిపెట్టమని అడిగారు.. అయితే నవాజ్ షరీఫ్ పిఎంఎల్-ఎన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తానని చెప్పారని అప్పటి సంఘటలు గుర్తు చేసుకున్నారు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..