AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Qatar Bribery Scandal: యూరప్‌ను కుదిపేస్తున్న భారీ కుంభకోణం.. సూట్‌కేసుల కొద్ది డబ్బులు.. రహస్య పత్రాలు స్వాధీనం..

గతంలో ఎన్నడూ లేని భారీ అవినీతి కుంభకోణం యూరప్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. ఖతర్‌గేట్‌ స్కాండల్‌ కేసు యూరోపియన్ పార్లమెంట్ (EP)లో పెనుదుమారం రేపింది..

Qatar Bribery Scandal: యూరప్‌ను కుదిపేస్తున్న భారీ కుంభకోణం.. సూట్‌కేసుల కొద్ది డబ్బులు.. రహస్య పత్రాలు స్వాధీనం..
Qatar Bribery Scandal
Shaik Madar Saheb
|

Updated on: Dec 17, 2022 | 12:55 PM

Share

గతంలో ఎన్నడూ లేని భారీ అవినీతి కుంభకోణం యూరప్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. ఖతర్‌గేట్‌ స్కాండల్‌ కేసు యూరోపియన్ పార్లమెంట్ (EP)లో పెనుదుమారం రేపింది.. ఈ క్రమంలో సూట్‌కేసుల కొద్ది డబ్బులు, పలు పత్రాలు దొరకడం గల్ఫ్ దేశాల్లో కలకలం మొదలైంది. యూరోపియన్ పార్లమెంటు వైస్ ప్రెసిడెంట్, గ్రీకు రాజకీయ నాయకురాలు ఎవా కైలీకి.. ఖతార్ తనకు అనుకూలంగా విధానాలను పొందేందుకు, విమర్శలను నిరోధించడానికి EU విధాన రూపకర్తలను లంచాలతో ప్రభావితం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి ఖతార్, మొరాకో సూట్‌కేస్‌ల కొద్ది డబ్బు, విలాసవంతమైన భవనాలు సమకూర్చినట్లు తేలింది. కాగా, “ఖతార్గేట్” కుంభకోణంలో ఇప్పటికే ఎవా కైలీని అరెస్టు చేశారు. ఈ క్రమంలో లంచం ఇవ్వడంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు పెద్ద ఎత్తున సూట్‌కేసుల కొద్ది నగదును స్వాధీనం చేసుకున్నారు. సూట్‌కేసుల నిండా డబ్బు, పలు పత్రాలు ఉన్న చిత్రాలను బెల్జియం పోలీసులు విడుదల చేశారు.

ఖతార్‌గేట్ కుంభకోణంలో బెల్జియన్ ఫెడరల్ పోలీసులు బ్రస్సెల్స్‌లోని పార్లమెంటు కార్యాలయాలు, 19 గృహాలతో సహా అనేక భవనాలపై దాడి చేశారు. ఈ సందర్భంగా సుమారు 1.5 మిలియన్ యూరోలు (£1.29 మిలియన్లు) స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కొన్ని హోటల్ గదిలోని సూట్‌కేస్‌లో దాచి ఉంచినట్లు పేర్కొన్నారు. బెల్జియన్ ప్రాసిక్యూటర్లు గ్రీకు నాయకురాలు, MEP ఎవా కైలీ, అలాగే ముగ్గురు ఇటాలియన్లు, ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్, మనీ లాండరింగ్, అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు మోపారు.

మాజీ EU చట్టసభ సభ్యుడు పియర్ ఆంటోనియో పంజేరి, పార్లమెంటరీ సహాయకురాలిగా ఉన్న కైలీ భాగస్వామి ఫ్రాన్సిస్కో గియోర్గి, మానవ హక్కుల ప్రచార సమూహం సెక్రటరీ జనరల్ నికోలో ఫిగా-తలమాంకా అభియోగాలు మోపిన వారిలో ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

బ్రస్సెల్స్‌లో ఒప్పందంలో భాగంగా వారు ప్రస్తుత ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఖతార్ నుంచి డబ్బు సంపాదించినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. దీనిపై గల్ఫ్ దేశం ఖతర్‌ స్పందించింది. తాము ఎలాంటి తప్పు చేయలేదంటూ పేర్కొంది. ప్రపంచ కప్‌కు ముందు ఖతార్ తన మానవ హక్కుల ఉల్లంఘనపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. వలస కార్మికుల పట్ల ఆదేశ ప్రవర్తన, స్వలింగ సంబంధాలపై వైఖరి, తదితర అంశాలపై ఖతార్‌పై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి.

గత నెల EPలో ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభంలో కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న కైలీ.. ఖతార్ కార్మిక హక్కులలో అగ్రగామిగా ఉందని దేశాన్ని ప్రశంసించింది. ఈ ఆరోపణల మధ్య యూరోపియన్ పార్లమెంటు వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి కైలీని తొలగించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..