AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srilanka: పునర్వైభవం కోసం రాజపక్స సోదరుల ఆరాటం.. 5 నెలల తర్వాత బహిరంగ సభ

దేశాన్ని అప్పులు ఊబిలోకి నెట్టి, ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యారనే అపవాదును ఎదుర్కొటున్న రాజపక్స సోదరులు కోల్పోయిన ప్రతిష్టను తిరిగి సాధించుకోవడంపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కలుతరలో తమ పార్టీ శ్రీలంక పొదుజన పెరుమున తరపున బహిరంగ సభ నిర్వహించారు.

Srilanka: పునర్వైభవం కోసం రాజపక్స సోదరుల ఆరాటం.. 5 నెలల తర్వాత బహిరంగ సభ
Rajapaksa Brothers
Basha Shek
|

Updated on: Oct 10, 2022 | 8:15 AM

Share

శ్రీలంక క్రమంగా కుదుట పడుతోంది. ప్రజల తిరుగుబాటుతో తమ పదవులకు రాజీనామా చేసి విదేశాలకు పారిపోయిన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, మాజీ ప్రధాని మహీంద రాజపక్స స్వదేశానికి తిరిగి వచ్చేశారు. దేశాన్ని అప్పులు ఊబిలోకి నెట్టి, ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యారనే అపవాదును ఎదుర్కొటున్న రాజపక్స సోదరులు కోల్పోయిన ప్రతిష్టను తిరిగి సాధించుకోవడంపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కలుతరలో తమ పార్టీ శ్రీలంక పొదుజన పెరుమున తరపున బహిరంగ సభ నిర్వహించారు. ‘కలిసి లేద్దాం.. కలుతర నుంచి ప్రారంభిద్దాం’ అనే పేరుతో నిర్వహించిన ఈ సభలో ప్రస్తుత ప్రధాని దినేష్ గుణవర్దన కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను చక్కద్దేందుకు ప్రయత్నిస్తున్న అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘేకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు మహింద రాజపక్స. అప్పట్లో రణిల్‌ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి విమర్శించామని, ఇప్పుడు తమతో కలిసి సరైన మార్గాన్ని ఎంచుకున్నారు రాబట్టి కీర్తిస్తున్నామని చమత్కరించారు. తన ప్రసంగంలో శ్రీలంక అధ్యక్షుడు గొట్టబయ అని మహీంద పేర్కొనగా, పక్కనే ఉన్న సహాయకుడు గుర్తు చేయడంతో సవరించుకున్నారు. మహీంద రాజపక్సను దేశం విడచి పోవద్దని శ్రీలంక కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన భారీ భద్రత మధ్య ట్రింకోమలై నావికా స్థావరంలో ఉంటున్నారు.

కాగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ తిరుగుబాటు చేయడంతో మేలో తన పదవికి రాజీనామా చేశారు గోటబయ రాజపక్సే. ఆతర్వాత ప్రజాగ్రహం పెరిగిపోవడంతో దేశం విడిచి పారిపోయారు. జూలై మధ్యలో మాల్దీవుల మీదుగా సింగపూర్‌కు వెళ్లారు, అక్కడి నుండి జూలై 14న తన రాజీనామాను పంపారు. తర్వాత తాత్కాలిక ఆశ్రయం కోరుతూ థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. అలా సుమారు రెండు నెలల తర్వాత సెప్టెంబరులో స్వదేశానికి చేరుకున్నారు. అంతకుముందు గొటబాయ రాజపక్స తన పదవి నుంచి వైదొలగిన తర్వాత శ్రీలంక పార్లమెంటు అప్పటి తాత్కాలిక అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాణిల్ విక్రమసింఘేను శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..