North Korea: మరోసారి రెచ్చిపోయిన ఉత్తర కొరియా.. 6 నిమిషాల వ్యవధిలో రెండు బాలిస్టిక్‌ క్షిపణులు.. ఆ దేశాలే టార్గెట్‌గా..

ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా జరిపిన ఏడో క్షిపణి ప్రయోగం ఇది. రెండు వారాల్లో ఎనిమిది క్షిపణి ప్రయోగాలు నిర్వహించింది. దీంతో ఈ ఏడాది ఉత్తర కొరియా ఇప్పటి వరకూ జరిపిన క్షిపణి ప్రయోగాల సంఖ్య 24కి చేరుకుంది.

North Korea: మరోసారి రెచ్చిపోయిన ఉత్తర కొరియా.. 6 నిమిషాల వ్యవధిలో రెండు బాలిస్టిక్‌ క్షిపణులు.. ఆ దేశాలే టార్గెట్‌గా..
Kim Jong Un
Follow us

|

Updated on: Oct 10, 2022 | 8:53 AM

వరుస మిస్సైల్‌ పరీక్షలతో జపాన్, అమెరికా, దక్షిణ కొరియాలకు కంటినిండా నిద్రను కరువు చేసిన ఉత్తర కొరియా మరోమారు చెలరేగింది. తాజాగా రెండు బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించింది. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ రెండు క్షిపణులను ప్రయోగించారు. ఈ మిస్సైల్స్‌ 100 కిలోమీటర్ల ఎత్తులో 350 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో పడిపోయాయి. జపాన్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ పరిధిలో ఇవి పడిపోయాయి. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా జరిపిన ఏడో క్షిపణి ప్రయోగం ఇది. రెండు వారాల్లో ఎనిమిది క్షిపణి ప్రయోగాలు నిర్వహించింది. దీంతో ఈ ఏడాది ఉత్తర కొరియా ఇప్పటి వరకూ జరిపిన క్షిపణి ప్రయోగాల సంఖ్య 24కి చేరుకుంది. ఉత్తర కొరియా క్షిపణులను పరీక్షించిన వెంటనే జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. ఇది తీవ్రమైన రెచ్చగొట్టే చర్య తప్ప మరోటి కాదని దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది.

కాగా ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ సంయుక్తంగా నిర్వహించిన యుద్ద విన్యాసాలపై ఉత్తర కొరియా ఆగ్రహంతో ఉంది. ప్రతీకారేచ్చతో రగిలిపోతూ క్షిపణుల పరీక్షలను మరింత ఉధృతం చేసింది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను కూడా లెక్క చేయడంలేదు. పైగా తాము నిర్వహించిన పరీక్షలు సర్వసాధారణమైనవేనని చెప్పుకుంటోంది ఉత్తర కొరియా.. అమెరికా బెదిరింపుల నుంచి స్వీయ రక్షణ కోసం, ఈ ప్రాంత శాంతి కోసం పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆ దేశం చెప్పుకుంటోంది. ఇంతటితో ఆగమని మ‌రిన్ని క్షిప‌ణి ప్రయోగాలు చేపట్టుతున్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..