Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. చుక్కలను తాకిన నిత్యావసరాల ధరలు.. లీటరు పాలు రూ.1,195, గ్యాస్ రూ.2,657..!

Sri Lanka Economy Crisis: ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ద్వీప దేశం శ్రీలంక భారీ మూల్యం చెల్లించుకుంటోంది. భారీగా పెరిగిన ధరలతో జనం అల్లాడిపోతున్నారు.

ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. చుక్కలను తాకిన నిత్యావసరాల ధరలు.. లీటరు పాలు రూ.1,195, గ్యాస్ రూ.2,657..!
Srilanka
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 11, 2021 | 7:14 PM

Sri Lanka Economy Crisis: ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ద్వీప దేశం శ్రీలంక భారీ మూల్యం చెల్లించుకుంటోంది. భారీగా పెరిగిన ధరలతో జనం అల్లాడిపోతున్నారు. ఆహార, ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాల ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. ఆహార పదార్థాలు సైతం అంతనంత ఎత్తుకు ఎగిరిపోయాయి. వస్తువుల ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేయడంతో సామాన్యుడు పస్తులుండే పరిస్థితి నెలకొంది. దీంతో ఆదేశంలో ప్రస్తుతం వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఏకంగా 90శాతం పెరిగి రూ. 657కు చేరింది. ఇక లీటర్‌ పాల ధర ఐదు రెట్లు పెరిగి రూ. 1,195గా ఉంది.

గత ఏడాది కాలంగా శ్రీలంకను ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనమైంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఎగుమతులు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి పర్యాటకరంగంపై తీవ్ర ప్రభావం చూపింది. శ్రీలంకకు విదేశీయుల రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. దీంతో భారీగా ఆదాయం పడిపోయింది. ఉన్న కాసిన్ని విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది ఆ దేశ ప్రభుత్వం. అయితే, నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమపిండి, కూరగాయాలు వంటి వస్తువులకు కూడా శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. కాగా, ఇలాంటి సమయంలో దిగుమతులపై శ్రీలంక ప్రభుత్వ నిషేధం విధించడంతో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చేతులు కాలాక, ఆకులు పట్టుకున్న చంధంగా మారింది ఆదేశ పరిస్థితి. దేశవ్యాప్తంగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిత్యావసరాల ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది.

అయితే ధరలపై నియంత్రణ తీసుకురావడంతో అక్రమ నిల్వలు పెరిగి మార్కెట్‌లో వస్తువుల సరఫరా భారీగా తగ్గింది. దీంతో ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత గురువారం అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధ్యక్షత అత్యవసరంగా సమావేశమైన కేంద్ర కేబినెట్.. ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని నిర్ణయించింది. దీని వల్ల అక్రమ నిల్వలను బయటకు తీసుకురావొచ్చని, తద్వారా సరఫరా పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే నిత్యావసరాలపై ధరల నియంత్రణను తొలగిస్తున్నట్లు గత శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు, ఒక్కసారిగా నిత్యావసర ధరల మోత మోగింది. గత శుక్రవారం రూ.1,400 ఉన్న 12.5కేజీల వంట గ్యాస్‌ సిలిండర్ ధర.. ఇప్పుడు రూ.2,657కు చేరింది. రెండు రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర అమాంతం రూ.1257 పెరిగింది. ఇక, లీటర్‌ పాల ధర రూ.250 నుంచి రూ.1195కు చేరింది. ఇవేకాకుండా ఇతర నిత్యావసరాల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. గోధుమ పిండి, పంచదార, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు, సిమెంట్‌ సహా దాదాపు అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు.

Read Also…. CM YS Jagan in Tirumala: తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి