Corona-Donald Trump: ట్రంప్‌కు కరోనా షాక్‌..! ట్రంప్ ను దెబ్భ మీద దెబ్బ కొడుతున్న కరోనా.. ఏం జరిగిందంటే..?(వీడియో)

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కాలం కలిసిరావడం లేదు. గత ఏడాది చివర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిచెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం ట్రంప్ ఆస్తుల విలువ గత కొన్నేళ్లుగా ఏ మాత్రం పెరగడం లేదు....

Corona-Donald Trump: ట్రంప్‌కు కరోనా షాక్‌..! ట్రంప్ ను దెబ్భ మీద దెబ్బ కొడుతున్న కరోనా.. ఏం జరిగిందంటే..?(వీడియో)

|

Updated on: Oct 11, 2021 | 5:56 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కాలం కలిసిరావడం లేదు. గత ఏడాది చివర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిచెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం ట్రంప్ ఆస్తుల విలువ గత కొన్నేళ్లుగా ఏ మాత్రం పెరగడం లేదు. అమెరికాలోని 400 మంది అత్యంత సంపన్నుల జాబితాలో డొనాల్డ్ ట్రంప్‌కు చోటు దక్కలేదు. అమెరికా సంపన్నులతో విడుదలైన ‘ఫోర్బ్స్ 400’జాబితాలో ట్రంప్ తన చోటు కోల్పోయారు. ఇలా జరగడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారి. గత ఏడాదికాలంలో ట్రంప్ ఆస్తుల విలువ ఏ మాత్రం పెరగలేదని ఫోర్బ్స్ వెల్లడించింది. ఏడాది క్రితం ఆయన మొత్తం ఆస్తుల విలువ 2.5 బిల్లియన్ డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు అది యధాతథంగా ఉన్నట్లు తెలిపింది.

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి ఫోర్బ్స్ 400 జాబితాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాంకు దిగజారుతూ వచ్చింది. ట్రంప్ ఆస్తుల విలువ పెరగకపోవడానికి కరోనా పాండమిక్ కూడా ఓ కారణంగా ఫోర్బ్స్ విశ్లేషించింది. ఫోర్బ్స్ 400 జాబితాలో చోటు దక్కించుకునేందుకు ట్రంప్ 400 మిల్లియన్ డాలర్ల దూరంలో ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఇక 2016 నుంచి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో ట్రంప్ తన రియల్ ఎస్టేట్ కంపెనీని సరిగ్గా పట్టించుకోలేదు. అలాగే తన రియల్ ఎస్టేట్ కంపెనీలోని వాటాలను మంచి అవకాశమున్నప్పుడు విక్రయించకుండా తన వద్దే అట్టి పెట్టుకోవడం వంటి తప్పిదాలు ట్రంప్ ఆస్తుల విలువ యధాతథంగా కొనసాగడానికి కారణంగా ఆ దేశ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అధ్యక్ష పదవిని కోల్పోయిన తర్వాత తన వ్యాపారంపై దృష్టిపెట్టనున్నట్లు ట్రంప్ ప్రకటించినప్పటికీ… కరోనా పాండమిక్ కారణంగా ఆయన తన రియల్ ఎస్టేట్ కంపెనీని లాభాల బాట పట్టించలేకపోతున్నారు. అయితే తాను తలుచుకుంటే తన సంపాదనను పెంచుకోవడం పెద్దవిషయమేమీ కాదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఫోర్బ్స్ తెలిపింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Manchu Vishnu-Prakash Raj-MAA Elections: ప్రకాష్ రాజ్ రాజీనామాపై ‘మంచు విష్ణు’ సంచలన ప్రెస్ మీట్.. (వీడియో)

 Manchu Vishnu In MAA Elections 2021: విష్ణు విజయానికి కారణాలు ఇవే.. అసలు విషయాలు వెల్లడి.. (వీడియో)

 RCB Vs KKR in IPL 2021: ఎవరు ఇంటికి…ఎవరు సెమీస్ కి… ఈ ఉత్కంఠ సమరంపై మరిన్ని వివరాలు..(వీడియో)

 Govt. Doctor Negligence Video: సర్కార్‌ వైద్యం.. నిర్లక్ష్యానికి ఇదే సాక్ష్యం..! తారాస్థాయిలో ఈ వీడియో చూసిన నెటిజన్ల ఆగ్రహం..

Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు