Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woman Challenge to terrorists: టెర్రస్టులకు యువతి సవాల్.. దమ్ముంటే రండిరా.. వైరల్ అవుతున్న వీడియో...

Woman Challenge to terrorists: టెర్రస్టులకు యువతి సవాల్.. దమ్ముంటే రండిరా.. వైరల్ అవుతున్న వీడియో…

Anil kumar poka

|

Updated on: Oct 12, 2021 | 10:41 AM

Srinagar Woman Challenge to terrorists: జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ యువతి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో యువతి టెర్రరిస్టులకు సవాల్ విసిరింది. దమ్ముంటే, ధైర్యముంటే నా ముందుకు రండిరా.. ముఖాముఖి చర్చించుకుందాం..

Srinagar Woman Challenge to terrorists: జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ యువతి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో యువతి టెర్రరిస్టులకు సవాల్ విసిరింది. దమ్ముంటే, ధైర్యముంటే నా ముందుకు రండిరా.. ముఖాముఖి చర్చించుకుందాం.. మీరేందో, మీ కథేందో తేలుస్తాం..అంటూ ఆ యువతి.. ఉగ్రమూకలకు సవాల్ విసిరింది.

శ్రీనగర్‌కు చెందిన వ్యాపారవేత్త ఎంఎల్ బింద్రూను ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా చంపేశారు. అయితే, తన తండ్రిని చంపిన టెర్రరిస్టులపై ఆయన కూతురు శ్రద్ధా బింద్రూ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలోనే ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘నా తండ్రి చనిపోయి ఉండొచ్చు. కానీ, అతని ఆత్మ జీవించే ఉంటుంది. మీకు ధైర్యం ఉంటే నా ముందుకు రండి. ముఖా ముఖి చర్చిద్దాం. అప్పుడు మీరేంతో తేలుస్తాం.’’ అని టెర్రరిస్టులకు శ్రద్ధా బింద్రూ సవాల్ విసిరారు. కాగా, ఈ వీడియోను జమ్మూ కశ్మీర్‌కు చెందిన పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ హుస్సేన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘భారతదేశం ఈమె లాంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చినంత కాలం పిరికిపందలైన ఉగ్రవాదులు ఎన్నటికీ విజయం సాధించలేరు.’ అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. 
మరిన్ని చదవండి ఇక్కడ : Honey Trap in hyderabad: ఫోటో చూసి టెంప్ట్‌ అయితే.. రూ.1.20లక్షలు హుష్‌కాకీ.. అసలు కధ వేరే ఉందిగా.. (వీడియో)

 Auto Drives Guinness Record: రెండు చక్రాల ఆటోడ్రైవర్‌..! అద్భుత ప్రతిభకు దక్కిన గిన్నిస్‌ రికార్డ్‌.. వైరల్ అవుతున్న వీడియో

 Airpods: మీ ఎయిర్‌పాడ్ పోయిందా..డోంట్‌ వర్రీ..ఇట్టే కనిపెట్టేయొచ్చు..!(వీడియో)

 Viral Video: రోడ్డుపై రూ.2 వేల నోట్ల కుప్పలు.. పోలీసులకు అందిన ఫిర్యాదు.. బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌పై ఫైర్‌(వీడియో)