Viral Video: రోడ్డుపై రూ.2 వేల నోట్ల కుప్పలు.. పోలీసులకు అందిన ఫిర్యాదు.. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌పై ఫైర్(వీడియో)
ముంబైలోని వాసాయ్ ప్రాంతంలో రోడ్డుపై కుప్పలుకుప్పలుగా 2 వేల రూపాయల నోట్లు పడి ఉండడంతో.. వాటిని ఏరుకోవడానికి స్థానికులు ఎగబడ్డారు. తీరా అవన్ని నకిలీ నోట్లు అని తెలియడంతో నిరాశతో వెనుదిరిగారు. కొంతమంది మాత్రం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌పై ఫైర్ అయ్యారు.
ముంబైలోని వాసాయ్ ప్రాంతంలో రోడ్డుపై కుప్పలుకుప్పలుగా 2 వేల రూపాయల నోట్లు పడి ఉండడంతో.. వాటిని ఏరుకోవడానికి స్థానికులు ఎగబడ్డారు. తీరా అవన్ని నకిలీ నోట్లు అని తెలియడంతో నిరాశతో వెనుదిరిగారు. కొంతమంది మాత్రం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌పై ఫైర్ అయ్యారు. నోట్ల కట్టలకు షాహిద్‌కు సంబంధం ఏంటనేగా మీ అనుమానం? ఆ నకిలీ డబ్బంతా షాహిద్ కపూర్ నటిస్తున్న వెబ్ సిరీస్ ‘సన్నీ’షూటింగ్ కోసం ఉపయోగించినదే.
‘ఫ్యామిలీ మాన్’సిరీస్ తర్వాత రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ ‘సన్నీ’.ఈ సిరీస్‌లో హీరోగా షాహిద్ కపూర్ నటించగా, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, రెజీనా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సిరీస్ షూటింగ్‌లో భాగంగా ఓ యాక్సిడెంట్ సన్నివేశం ఉంది. ఆ సమయంలో 2 వేల నోట్లు రోడ్డుపై పడిపోవాలి. దీని కోసం నకిలీ నోట్లను ఉపయోగించింది చిత్ర యూనిట్. కానీ షూటింగ్ అయిపోయాక వాటిని తీసేయడం మర్చిపోయారు. దీంతో ఆ ప్రాంతంలోకి కొంతమంది అవి నిజమైన డబ్బులే అనుకొని ఏరుకునేందుకు ఎగబడ్డారు. తర్వాత అసలు విషయం తెలుసుకొని నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయంపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గాంధీ మహాత్ముడు ఫొటో ఉన్న నోట్లను రోడ్డుపై పారేసిన వారిపై చర్యలు తీసుకోవాలని శివసేన మాజీ కార్పొరేటర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. షూటింగ్‌కి చిత్రబృందం అనుమతి తీసుకుందని, అయితే గాంధీజీకి అవమానం జరిగిందనే విషయంపై విచారణ చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.
మరిన్ని చదవండి ఇక్కడ : News Watch: పాలు రూ.1,195 గ్యాస్ సిలిండర్ రూ.2,657… కరెంట్ కోతలు తప్పవా… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్
Venkatesh Comments: సామ్-చై విడాకులపై వైరల్ అవుతోన్న వెంకీమామ పోస్టులు..! ఏమన్నారంటే..(వీడియో)
Know This: పాముల్లో గుండె కిందికి పైకి కదులుతుందా..!? ఆసక్తికర విషయాలు మీ కోసం ఈ వీడియోలో…
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

