AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh Comments: సామ్‌-చై విడాకులపై వైరల్‌ అవుతోన్న వెంకీమామ పోస్టులు..! ఏమన్నారంటే..(వీడియో)

Venkatesh Comments: సామ్‌-చై విడాకులపై వైరల్‌ అవుతోన్న వెంకీమామ పోస్టులు..! ఏమన్నారంటే..(వీడియో)

Anil kumar poka
|

Updated on: Oct 12, 2021 | 9:10 AM

Share

టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకున్నట్టు ప్రకటించి నాలుగు రోజులైనా.. ఆ విషయం సోషల్‌ మీడియాలో ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. వారిద్దరికీ సంబంధించిన వార్తలతో సోషల్‌ మీడియా హోరెత్తిపోతుంది.

టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకున్నట్టు ప్రకటించి నాలుగు రోజులైనా.. ఆ విషయం సోషల్‌ మీడియాలో ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. వారిద్దరికీ సంబంధించిన వార్తలతో సోషల్‌ మీడియా హోరెత్తిపోతుంది. వీరి విడాకులకు కారణాలేంటి? తప్పెవరిది.. ఒప్పెవరిది? ఇలా పలురకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. సమంతనే హద్దులు దాటింది.. తొందరపడకుండా ఉండాల్సింది అని కొందరంటుంటే.. నాగచైతన్యదే తప్పు అని వేలెత్తి చూపుతున్నారు మరికొందరు. అయితే ఇది పూర్తిగా వారి వ్యక్తిగత వ్యవహారమని ఇంకొందరు లైట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నాగార్జున తప్పించి వీరి విడాకులపై కుటుంబ పెద్దలెవ్వరూ స్పందించలేదు.

ముఖ్యంగా సురేష్ బాబు, వెంకటేష్ లు సామ్ పై పీకల్లోతు కోపంగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో వెంకటేష్‌ బాబు చేసిన కొన్ని కామెంట్స్‌ ఈ అనుమానాలకి బలాన్నిచ్చేవిధంగా ఉన్నాయి. ఇప్పుడవి సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ ఎవర్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారో తెలీదు కానీ.. అవి సమంత కోసమే అన్నట్టు నెటిజన్స్ కామెంట్స్ చేసుకుంటున్నారు. ‘మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు కాస్త బుర్ర కూడా పెట్టాలి అని ఒక పోస్ట్‌ చేశారు. తర్వాత మరొక పోస్ట్‌లో ‘మనసు అనేది ఆలోచనల పుట్ట.. మనం వెళ్లే మార్గాన్ని జాగ‍్రత్తగా ఎంచుకోవాలి’ అంటూ వెంకీ తన ఇన్‌స్టా స్టోరీలో వరుస పోస్ట్‌లు పెట్టారు. సాధార‌ణంగా వెంక‌టేశ్ రెగ్యుల‌ర్‌గా ఇటువంటి కొటేషన్లు పెడుతుంటారు. అయితే, చై-సామ్ విడిపోయిన వేళ ఆయ‌న చేసిన‌ పోస్టులు ఆస‌క్తిక‌రంగా మారాయి.

మరిన్ని చదవండి ఇక్కడ : Know This: పాముల్లో గుండె కిందికి పైకి కదులుతుందా..!? ఆసక్తికర విషయాలు మీ కోసం ఈ వీడియోలో…

 cheddi gang In Tirupathi: చెడ్డి గ్యాంగ్ ఎంట్రీతో పోలీసుల్లోనూ వణుకు… తిరుపతిలో చెడ్డీగ్యాంగ్ హల్ చల్.. (వీడియో)

 Amavaasya Jaathara: ఘనంగా అమావాస్య జాతర.. వైకుంఠంలా మారిన స్మశానం..! వైరల్ అవుతున్న వీడియో..

 Bodh Gaya Ground Report: ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్స్..! బోధ్ గయ గురించి ఆసక్తికర విశేషాలు.. (వీడియో)