Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amavaasya Jaathara: ఘనంగా అమావాస్య జాతర.. వైకుంఠంలా మారిన స్మశానం..! వైరల్ అవుతున్న వీడియో..

Amavaasya Jaathara: ఘనంగా అమావాస్య జాతర.. వైకుంఠంలా మారిన స్మశానం..! వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Oct 12, 2021 | 8:37 AM

స్మశానం పేరు చెబితే అందరికీ ఒక భయం మొదలవుతుంది.. అదే చీకటి పడితే స్మశానాల్లోకి వెళ్లాలంటే.. అందునా అమావాస్య రోజున.. రాత్రి వేళల్లో వెళ్లాలంటే... ఎలా ఉంటుంది..కానీ ఒక్కరు కాదు ఇద్దరు ఏకంగా ఊరు మొత్తం స్మశానం వైపు అడుగులు వేస్తున్నారు.

స్మశానం పేరు చెబితే అందరికీ ఒక భయం మొదలవుతుంది.. అదే చీకటి పడితే స్మశానాల్లోకి వెళ్లాలంటే.. అందునా అమావాస్య రోజున.. రాత్రి వేళల్లో వెళ్లాలంటే… ఎలా ఉంటుంది..కానీ ఒక్కరు కాదు ఇద్దరు ఏకంగా ఊరు మొత్తం స్మశానం వైపు అడుగులు వేస్తున్నారు. చిమ్మచీకట్లు కనిపించే స్మశానాల్లో దీపాల కాంతులు.. జాతరను తలపించేలా జనం.. చిన్న పిల్లలు, మహిళలు మొదలుకొని వందలాది మంది జనం..ఇంతకీ ఎందుకు స్మశానాల్లో అంత జనం ఉన్నారు.. అమావాస్య రోజు వారు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు చూద్దాం…

ఏడాదికోసారి వచ్చే పండగ.. అది కూడా మరే ప్రాంతంలో కనిపించని భిన్నమైనది..అమావాస్య రోజున జరుపుకునే అతి పవిత్రమైనది..అదే మహాలయ అమావాస్య. పితృదేవతలకు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే పండుగ. కొన్ని వందల ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయం. ఉగాది, దసరా, దీపావళికి మించిన పండుగ. రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఈ పండగ జరుపుకుంటారు.

ఇక్కడ ప్రతి కులంలోనూ రెండు వర్గాలు ఉంటాయి. అందులో ఒకటి నాముదార్లు, రెండవది మొడికాళ్లు. నాముదార్లు ప్రతిఏటా నవరాత్రులు ప్రారంభానికి ముందు రోజు వచ్చే అమావాస్య రోజున మహాలయ అమావాస్య పండగ జరుపుకుంటారు. ప్రతి కుటుంబంలో చనిపోయిన తమ పెద్దల కోసం నిర్వహించే పూజ ఇది…అన్ని పండగలకన్నా భిన్నం ఇది… ఇంట్లో పితృదేవల చిత్ర పటాలకు పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. అక్కడ వారికి దుస్తులు, ఇష్టమైన తిండి పదార్థాలు, ఒక వేళ మద్యం సేవించే వారు అయితే మద్యం కూడా అక్కడ పెడతారు. ప్రధానంగా నాన్ వెజ్ ను ఎక్కువగా నైవేద్యంగా పెడతారు. ఇలా తమ పెద్దల వద్ద పూజ చేసి.. కుటుంబసభ్యులంతా కలసి.. స్మశానానికి వెళ్తారు. అక్కడ పూజలు చేస్తారు. ముందుగా సమాధులను శుభ్రం చేసి పూలహారాలు వేసి, దీపాలు వెలిగించి వారికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా పెట్టి పూజలు చేస్తారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందల సంఖ్యలో స్మశానాలకు తరలివస్తారు..
కేవలం పురుషులే కాదు.. మహిళలు, చివరకు చిన్న పిల్లలు కూడా తరలివస్తారు. ఈ సమయంలో విద్యుత్ దీపాలతో పాటు, సమాధుల వద్ద వెలిగించే దీపాలతో స్మశానం ఒక వైకుంఠంలా కనిపిస్తుంది. ఈ సమయంలో స్మశానం మొత్తం తమ కుటుంబ పెద్దల పేర్లు చెప్పుకుని గోవిందా గోవిందా అన్న నామస్మరణలే వినిపిస్తాయి. ప్రతి ఒక్కరూ నామం ధరించి ఎంతో పవిత్రంగా తమ పెద్దలకు పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో తమ పెద్దలు పై నుంచి ఆహార పదార్థాలు తిని తమను ఆశీర్వదిస్తారని నమ్మకం. ఇలా అమావాస్య రోజున స్మశానానికి రావడం భయం లేదా అంటే ఎందుకు భయం మా పెద్దలు వచ్చి ఆశీర్వదిస్తారు.. ఇది ఒక వైకుంఠం అని చెబుతారు. మొత్తం మీద ఏడాదిలో ఈ ఒక్కరోజు స్మశానం ఒక వైకుంఠాన్ని తలపిస్తుంది….

మరిన్ని చదవండి ఇక్కడ : Bodh Gaya Ground Report: ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్స్..! బోధ్ గయ గురించి ఆసక్తికర విశేషాలు.. (వీడియో)

 Krish on Konda Polam: డైరెక్టర్ క్రిష్ సంచలన కామెంట్స్.. కొండపొలం మూవీ నేను చేయకపోతే.. ఆయన చేసేవారు..!(వీడియో)

 Corona-Donald Trump: ట్రంప్‌కు కరోనా షాక్‌..! ట్రంప్ ను దెబ్భ మీద దెబ్బ కొడుతున్న కరోనా.. ఏం జరిగిందంటే..?(వీడియో)

 Manchu Vishnu-Prakash Raj-MAA Elections: ప్రకాష్ రాజ్ రాజీనామాపై ‘మంచు విష్ణు’ సంచలన ప్రెస్ మీట్.. (వీడియో)