cheddi gang In Tirupathi: చెడ్డి గ్యాంగ్ ఎంట్రీతో పోలీసుల్లోనూ వణుకు… తిరుపతిలో చెడ్డీగ్యాంగ్ హల్ చల్.. (వీడియో)
టెంపుల్ సిటీ, ఆధ్యాత్మిక నగరం తిరుపతి దొంగల భయంతో వణికి పోతోంది. తిరుపతిలో అర్బన్ జిల్లా పోలీసు యంత్రాంగానికి దొంగతనాలు సవాలుగా మారాయి... చెడ్డి గ్యాంగ్ ఎంట్రీతో పోలీసుల్లో కలవరం నెలకొంది.
టెంపుల్ సిటీ, ఆధ్యాత్మిక నగరం తిరుపతి దొంగల భయంతో వణికి పోతోంది. తిరుపతిలో అర్బన్ జిల్లా పోలీసు యంత్రాంగానికి దొంగతనాలు సవాలుగా మారాయి… చెడ్డి గ్యాంగ్ ఎంట్రీతో పోలీసుల్లో కలవరం నెలకొంది. తాళం వేసిన ఇళ్లు, అపార్ట్ మెంట్లను దొంగల ముఠా టార్గెట్ చేసింది. విద్యానగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో చొరబడ్డ చెడ్డీగ్యాంగ్ కదలికలు సిసి కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించిన పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది.
ఉత్తర భారతానికి చెందిన చెడ్డి గ్యాంగ్ ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల చోరీలకు పాల్పడ్డాయి. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చెడ్డి గ్యాంగ్ ముఠా… ఇప్పుడు తిరుపతిపై పడింది. విద్యా నగర్ లోని ఒక అపార్ట్మెంట్లోకి చోరీకి యత్నించిన చెడ్డి గ్యాంగ్ సీసీ కెమెరాల కంట పడింది. దీంతో అప్రమత్తమైన అర్బన్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఆరు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టింది.
క్రైమ్ సినిమాలోని ఒక సన్నివేశంలా కనిపించే చెడ్డి గ్యాంగ్ ఎంట్రీ సీన్లు తిరుపతిలోని చోరీలు జరిగిన అపార్ట్మెంట్ లలో ఇళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చెడ్డీ గ్యాంగ్ చోరీకి యత్నించిన విద్యా నగర్ కాలనీలోని అపార్ట్మెంట్ లో సేకరించిన ఫింగర్ ప్రింట్స్ తో, సిసి ఫుటేజ్ తో గ్యాంగ్ ను పట్టుకునే ప్రయత్నం పోలీస్ యంత్రాంగం చేస్తోంది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకుని తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకునే ఈ గ్యాంగ్ లో మహిళలు కూడా ఉంటారు. వారు పగలు బిచ్చగాళ్లుగా లేదంటే ఇంటింటికి తిరిగి బొమ్మలు, దుప్పట్లు విక్రయిస్తూ స్కెచ్ వేస్తే అర్ధరాత్రి దాటాక అమలు చేసేది చెడ్డి గ్యాంగ్ పని గా భావిస్తున్నారు పోలీస్ యంత్రాంగం..తిరుపతిలో వరుస దొంగతనాలతో పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Amavaasya Jaathara: ఘనంగా అమావాస్య జాతర.. వైకుంఠంలా మారిన స్మశానం..! వైరల్ అవుతున్న వీడియో..
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

