Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airpods: మీ ఎయిర్‌పాడ్ పోయిందా..డోంట్‌ వర్రీ..ఇట్టే కనిపెట్టేయొచ్చు..!(వీడియో)

Airpods: మీ ఎయిర్‌పాడ్ పోయిందా..డోంట్‌ వర్రీ..ఇట్టే కనిపెట్టేయొచ్చు..!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 12, 2021 | 9:56 AM

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మరో సంచలనానికి తెర లేపింది. స్మార్ట్ ఫోన్లు, వాచ్‌లలో సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చిన యాపిల్.. ఇప్పుడు ఎయిర్‌పాడ్‌లలో నూతన టెక్నాలజీని ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో యాపిల్ దాని వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్...

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మరో సంచలనానికి తెర లేపింది. స్మార్ట్ ఫోన్లు, వాచ్‌లలో సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చిన యాపిల్.. ఇప్పుడు ఎయిర్‌పాడ్‌లలో నూతన టెక్నాలజీని ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో యాపిల్ దాని వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌ లో కోల్పోయిన ఎయిర్‌పాడ్‌లను గుర్తించే సామర్థ్యం ఉన్న ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ iOS 15 తో రావాల్సిఉంది. కానీ అప్పుడు అది అందుబాటులోకి రాలేదు. అయితే, తాజాగా యాపిల్‌ ఎయిర్‌పాడ్స్ ప్రో, ఇంకా ఎయిర్‌పాడ్స్ కోసం ఫర్మ్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది యాపిల్. ఇది ‘ఫైండ్‌ మై యాప్‌’తో అనుసంధానించబడి.. సులభంగా కనుగొనడానికి వీలవుతుంది.
యాపిల్‌ ఎయిర్‌పాడ్స్ ప్రో, మరియు ఎయిర్‌పాడ్స్ మాక్స్ లో ఫర్మ్‌వేర్ అప్‌డేట్‌ ద్వారా ఫైండ్ మై నెట్‌వర్క్ టూల్స్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు నిరంతరం బ్లూటూత్ బీకాన్ సందేశాలను పంపిస్తాయి. ఒకవేళ ఎయిర్‌పాడ్‌లు పోయినా సిగ్నల్స్ ఆధారంగా.. ఫైండ్ మై నెట్‌వర్క్‌లో కనిపెట్టవచ్చు. అంతేకాదు.. యూజర్‌కు ఎయిర్‌పాడ్స్‌ల లొకేషన్‌ను విజువల్ ఇండికేటర్‌గా చూపిస్తుంది. అయితే మీరు యాపిల్ ఎయిర్‌పాడ్స్ తీసుకుని చాలా ఏళ్లు అయినా పర్వాలేదు. ఫర్మ్‌వేర్‌ ను మీ ఎయిర్‌పాడ్స్‌లోనూ పొందవచ్చు. యాపిల్ ఎయిర్‌పాడ్స్‌లను కేస్ లోపల పెట్టి.. ఆ కేస్‌ను ఐఫోన్ పక్కన పెట్టాలి. అప్పుడు ఫర్మ్‌వేర్ ఆటోమాటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. కాకపోతే కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు వేచి చూడాలి. దీనికి సంబంధించి మీ మొబైల్ ఫోన్‌లో ఇండికేషన్స్ వస్తాయి. ఫర్మ్‌వేర్ అప్‌డేట్ అయ్యాక ఫోన్‌కు సందేశం వస్తుంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video: రోడ్డుపై రూ.2 వేల నోట్ల కుప్పలు.. పోలీసులకు అందిన ఫిర్యాదు.. బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌పై ఫైర్‌(వీడియో)

 News Watch: పాలు రూ.1,195 గ్యాస్ సిలిండర్ రూ.2,657… కరెంట్ కోతలు తప్పవా… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

 Venkatesh Comments: సామ్‌-చై విడాకులపై వైరల్‌ అవుతోన్న వెంకీమామ పోస్టులు..! ఏమన్నారంటే..(వీడియో)

 Know This: పాముల్లో గుండె కిందికి పైకి కదులుతుందా..!? ఆసక్తికర విషయాలు మీ కోసం ఈ వీడియోలో…