Honey Trap in hyderabad: ఫోటో చూసి టెంప్ట్ అయితే.. రూ.1.20లక్షలు హుష్‌కాకీ.. అసలు కధ వేరే ఉందిగా.. (వీడియో)
సైబర్ నేరగాళ్లతో పాటు హనీట్రాప్ విచ్చలవిడిగా కొనసాగుతోంది. రోజుకో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు...తాజాగా ఇలాంటి సైబర్ క్రైమ్ ఘటనే ఒకటి హైదరాబాద్‌లోనే జరిగింది. హైదరాబాద్‌కు చెందిన యువతి గుంటూరుకు చెందిన వ్యక్తిని మోసం చేసింది.
సైబర్ నేరగాళ్లతో పాటు హనీట్రాప్ విచ్చలవిడిగా కొనసాగుతోంది. రోజుకో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు…తాజాగా ఇలాంటి సైబర్ క్రైమ్ ఘటనే ఒకటి హైదరాబాద్‌లోనే జరిగింది. హైదరాబాద్‌కు చెందిన యువతి గుంటూరుకు చెందిన వ్యక్తిని మోసం చేసింది. ఏకంగా 1కోటి 20లక్షల రూపాయలు కాజేసింది..దీంతో బాధితుడు లబోదిబోమంటూ… సైబారాబాద్ పోలీసులను ఆశ్రయించాడు.
గుంటురు జిల్లాకు చెందిన వి.సుబ్బా రెడ్డి అనే వ్యక్తికి బాగ్ అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన సాయిరాంతో గతంలో కొంత పరిచయం ఉంది. ఈ క్రమంలోనే… సాయిరాం తన మరదలు అయిన అర్చన అనే 24 ఏళ్ల యువతిని ఫోన్ ద్వారా పరిచయం చేశాడు. ఆమె బ్యూటీ పార్లర్ నడుపుతుందని తన వ్యాపార విస్తరణ పెట్టుబడి కోసం ఏదైనా సహాయం చేయాలని కోరుతూ సుబ్బా రెడ్డికి ఆమె ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఆ తర్వాత సుబ్బారెడ్డి, అర్చన ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అయితే అర్చన తన ఫొటోకు బదులు అందమైన అమ్మాయి ఫొటోను డిస్‌ప్లే పిక్చర్‌గా ఉంచింది. ఆ ఫోటో ఆమెదే అని సుబ్బా రెడ్డి నమ్మాడు. తరచు సుబ్బారెడ్డికి ఫోన్ చేసి బ్యూటీపార్లర్, ఇతర అవసరాల పేరుతో విడతలవారీగా అన్‌లైన్ ద్వారా లక్షల నగదు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది.
అయితే, సుబ్బా రెడ్డి ఆమెను నేరుగా కలవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కానీ, ఆమె ఏవేవో సాకులు చెబుతూ తప్పించుకునేది. ఈ ఏడాది ఆగస్టు వరకూ ఇలాగే తిరిగేది. ఆమె కోసం గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సుబ్బా రెడ్డి కలిసేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఫోన్ ద్వారా ఒత్తిడి చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు అర్చన, అమె బావ సాయిరాం, ప్రియుడు అనిల్ కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Auto Drives Guinness Record: రెండు చక్రాల ఆటోడ్రైవర్..! అద్భుత ప్రతిభకు దక్కిన గిన్నిస్ రికార్డ్.. వైరల్ అవుతున్న వీడియో
Airpods: మీ ఎయిర్‌పాడ్ పోయిందా..డోంట్ వర్రీ..ఇట్టే కనిపెట్టేయొచ్చు..!(వీడియో)