Viral Video: సోఫాలో కూర్చున్నారు.. ఊహించని షాక్ తిన్నారు.. పక్కనే ఉన్న సీన్ చూసి నోరెళ్లబెట్టారు.!

సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే మనం దడుసుకుంటాం. అలాంటిది ఆ పాము మన దగ్గరగా ఉంటే.. ఇంకేమైనా ఉందా.?..

Viral Video: సోఫాలో కూర్చున్నారు.. ఊహించని షాక్ తిన్నారు.. పక్కనే ఉన్న సీన్ చూసి నోరెళ్లబెట్టారు.!
Trending
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 12, 2021 | 10:11 AM

సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే మనం దడుసుకుంటాం. అలాంటిది ఆ పాము మన దగ్గరగా ఉంటే.. ఇంకేమైనా ఉందా.? మన గుండె ఆగినంత పనవుతుంది. ఇదిలా ఉంటే సరీసృపాలలో పైథాన్ ప్రమాదకరమైనది. ఇది జగమెరిగిన సత్యం. ఎంతటి జంతువునైనా చుట్టేసి మరీ మింగేస్తుంది. ఇక అలాంటి భయంకరమైన పాము ఏం చేసిందో ఈ వీడియోలో చూడండి..

ఆ కుటుంబం ఎప్పటిలానే ఉదయం తమ పనులు ముగించుకుని వరండాలో సేద తీరడానికి బయటికి వచ్చారు. సోఫాపై కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకోవచ్చు కదా అని అనుకున్నవాళ్లకి ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. అక్కడ ఓ భారీ పైథాన్ ఇంచక్కా సోఫాపై ఎండ తగులుతున్న చోట సేద తీరుతూ కనిపించింది. దానిని చూసిన ఆ కుటుంబం మొదట భయపడినా.. ఆ తర్వాత తేరుకుని snake క్యాచర్స్‌కు సమాచారం అందించింది. వారి అక్కడి చేరుకొని దాన్ని పట్టి బంధించారు.

“కార్పెట్ పైథాన్‌లు.. ఇవి మేము తరచుగా పట్టుకునే పాములు. ఇవి మనుషులకు ఇబ్బంది కలిగించవు. అవి తరచూ ఇలాంటి ప్రదేశాలలోనే ఉంటాయి. వాటి చుట్టుపక్కల ప్రజలు ఉన్నా కూడా కదలవు. ఇతర పాములు అయితే తమను తాము రక్షించుకునేందుకు ఎదురు తిరుగుతాయి.”అని ఆ స్నేక్ క్యాచర్స్ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.! కాగా, ఈ వీడియో పాతదే అయినా.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మరోసారి వైరల్‌గా మారింది. దీనిని ఇప్పటివరకు 5.99 లక్షల మంది వీక్షించారు. అలాగే 1,100 లైకులు వచ్చాయి.

Also Read:

వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!