135 పరుగుల టార్గెట్.. ఈ బ్యాట్స్‌మెన్ ఒక్కడే ఒంటరిగా సెంచరీతో కదంతొక్కాడు.. ఎవరో తెలుసా?
మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్ మొదలు కానుంది. ఆ మెగా టోర్నమెంట్‌కు సిద్దం కావడానికి పలు జట్లు ముందుగానే యూఏఈలో టీ20 మ్యాచ్‌లు
మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్ మొదలు కానుంది. ఆ మెగా టోర్నమెంట్‌కు సిద్దం కావడానికి పలు జట్లు ముందుగానే యూఏఈలో టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో ప్రత్యర్ధి జట్టు విధించిన టార్గెట్‌ను చేధించే క్రమంలో ఓ బ్యాట్స్‌మెన్ తన టీమ్‌కు విజయం అందించేందుకు ఒంటరి పోరాటం చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ బాదేశాడు. ఆ మ్యాచ్ ఏంటి.? ఆ బ్యాట్స్‌మెన్ ఎవరో చూసేద్దాం పదండి..
అక్టోబర్ 10వ తేదీన యూఏఈ, ఐర్లాండ్ మధ్య ఆరో టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసింది. ఓపెనర్ స్టిర్లింగ్ 40 పరుగులు చేయగా.. కెవిన్ ఓ బ్రెయిన్(54) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. అటు యూఏఈ బౌలర్లలో ముస్తఫా మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇక లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన యూఏఈ జట్టుకు ఆదిలోని షాక్ తగిలింది. ఓపెనర్ చిరాగ్ సూరి 4 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. అయితే మరో ఓపెనర్ వసీమ్(107) క్రీజులో నిలదొక్కుకుని పరుగుల రాబట్టాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు స్థిరంగా రన్స్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు వసీమ్.. ఈ క్రమంలోనే అతడు తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 62 బంతుల్లో 107 పరుగులు చేసిన వసీమ్ చివరి వరకు అజేయంగా నిలిచి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. వసీమ్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. కాగా, చేధించాల్సిన టార్గెట్ 135 కాగా.. అందులో 107 పరుగులు వసీమ్ చేయడం గమనార్హం.
Read Also: సమంతపై వస్తోన్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందించాలి: సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్
ఈ ఫోటోలో సింహాన్ని గుర్తించండి.. కనిపెట్టండి అంత ఈజీ కాదు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!
భారీ పామును చెడుగుడు ఆడుకున్న కుక్క.. మాములుగా లేదుగా.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!