AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క రోజులో 95 పరుగులు..12 వికెట్లు.. టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన మ్యాచ్‌..

Cricket News: ఒక క్రికెటర్ ప్రతిభ టెస్ట్ మ్యాచ్‌లో తెలుస్తుంది. ఆటగాడి సామర్థ్యం,​సహనం, సంయమనం, దూకుడు, ఐదు రోజులు జరిగే టెస్ట్‌ మ్యాచ్‌లో పరీక్షిస్తారు.

ఒక్క రోజులో 95 పరుగులు..12 వికెట్లు.. టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన మ్యాచ్‌..
Fazal Mahmood
Follow us
uppula Raju

|

Updated on: Oct 11, 2021 | 10:12 AM

Cricket News: ఒక క్రికెటర్ ప్రతిభ టెస్ట్ మ్యాచ్‌లో తెలుస్తుంది. ఆటగాడి సామర్థ్యం,​సహనం, సంయమనం, దూకుడు, ఐదు రోజులు జరిగే టెస్ట్‌ మ్యాచ్‌లో పరీక్షిస్తారు. టెస్ట్ క్రికెట్‌లో పరుగులు చేయడం మాత్రమే కాదు క్రీజులో నిలవడం కూడా అంతే ముఖ్యం. అయితే ఒక టెస్ట్ మ్యాచ్‌లో రోజంతా ఆట కొనసాగింది. కేవలం 95 పరుగులు మాత్రమే వచ్చాయి. అంతేకాదు ఒక్క రోజులో 12 వికెట్లు పడ్డాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఈ మ్యాచ్‌1956 లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. కరాచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లు కలిసి 95 పరుగులు చేశాయి.

ఈ సమయంలో ఆస్ట్రేలియాకు 10, పాకిస్థాన్‌కు రెండు వికెట్లు కోల్పోతుంది. ఈ మ్యాచ్‌ ఇదే రోజున జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్ట్ అక్టోబర్ 11న కరాచీలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఇయాన్ జాన్సన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ ఈ నిర్ణయం పాకిస్తాన్ కెప్టెన్ అబ్దుల్ కర్దార్‌కి కలిసి వచ్చింది. ఫజల్ మహమూద్, ఖాన్ మొహమ్మద్ బౌలింగ్ ముందు కంగారులకు ఏమి అర్థం కాలేదు. ఆస్ట్రేలియా జట్టు 53.1 ఓవర్లలో కేవలం 80 పరుగులకు మాత్రమే ఆలౌట్‌ అయింది.

ఫజల్ మహమూద్ 27 ఓవర్లు బౌలింగ్ చేసి 34 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. అదే సమయంలో ఖాన్ మొహమ్మద్ 26.1 ఓవర్లు బౌలింగ్ చేశాడు 43 పరుగులకు 4 వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా తరఫున కీత్ మిల్లర్ అత్యధికంగా 21 పరుగులు చేశాడు. అదే రోజు బ్యాటింగ్‌కి దిగిన పాకిస్థాన్ రెండు వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసింది. రెండో రోజు 199 పరుగులు ఆలౌట్‌ అయ్యారు. కెప్టెన్ అబ్దుల్ కర్దార్ 69 పరుగులు, వజీర్ మొహమ్మద్ 67 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కూడా పెద్ద స్కోరు చేయలేకపోయింది. రిచీ బెనౌ హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియా 187 పరుగులు చేసింది. ఫజల్ మహమూద్ 80 పరుగులకు ఏడు వికెట్లు తీశాడు. ఖాన్ మొహమ్మద్ మిగిలిన మూడు వికెట్లు తీశాడు. పాకిస్థాన్ 69 పరుగుల లక్ష్యాన్ని సాధించింది.

Talaq – Khula: ‘తలాక్ ఇవ్వు.. లేకపోతే నేనే ఖులా ఇస్తాను’.. భర్తకు షాకిచ్చిన భార్య.. పాతబస్తీలో షాకింగ్ సీన్..