Auto Drives Guinness Record: రెండు చక్రాల ఆటోడ్రైవర్..! అద్భుత ప్రతిభకు దక్కిన గిన్నిస్ రికార్డ్.. వైరల్ అవుతున్న వీడియో
ఓ ఆటో డ్రైవర్ ఆటోను రెండు చక్రాలతో నడిపి రికార్డు సృష్టించాడు. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. ఈ వీడియోనే కాకుండా ప్రపంచ రికార్డులకు సంబంధించి పలు వీడియోలు, చిత్రాలను ప్రజలతో పంచుకుంది.
ఓ ఆటో డ్రైవర్ ఆటోను రెండు చక్రాలతో నడిపి రికార్డు సృష్టించాడు. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. ఈ వీడియోనే కాకుండా ప్రపంచ రికార్డులకు సంబంధించి పలు వీడియోలు, చిత్రాలను ప్రజలతో పంచుకుంది. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ఆటో డ్రైవర్ జగదీష్ తన ఆటోను రెండు చక్రాలతో 2.2 కిలోమీటర్లు నడిపారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
జగదీష్ తన స్టీరింగ్ ఉపయోగించి మూడు చక్రాల వాహనాలను రెండు చక్రాలతో నడిపాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధిస్తానని తను అనుకోలేదని అన్నారు. చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నియమం ప్రకారం కేవలం ఒక కిలోమీటరు దూరం వరకు రెండు చక్రాలపై నడిపితే రికార్డు సృష్టించినట్లే.. కానీ జగదీష్ తన మూడు చక్రాల వాహనాన్ని రెండు చక్రాలపై 2.2 కిలోమీటర్ల దూరం నడిపి రికార్డు సృష్టించాడు. జగదీష్ ప్రతిభను చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Airpods: మీ ఎయిర్‌పాడ్ పోయిందా..డోంట్ వర్రీ..ఇట్టే కనిపెట్టేయొచ్చు..!(వీడియో)
Venkatesh Comments: సామ్-చై విడాకులపై వైరల్ అవుతోన్న వెంకీమామ పోస్టులు..! ఏమన్నారంటే..(వీడియో)
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

