Russia-Ukraine War: మాకు ఆ ఆలోచన లేదు.. రష్యా అధ్యక్షుడి మార్పుపై అగ్రదేశం కీలక ప్రకటన..

ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగుతున్నాయి. పెద్దనగరాలను మాత్రమే కాకుండా చిన్న పట్టణాలపై కూడా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా అధ్యక్షుడని మార్చేందుకు తాము కుట్ర చేస్తునట్టు..

Russia-Ukraine War: మాకు ఆ ఆలోచన లేదు.. రష్యా అధ్యక్షుడి మార్పుపై అగ్రదేశం కీలక ప్రకటన..
Russia Ukraine War
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 28, 2022 | 8:22 AM

ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగుతున్నాయి. పెద్దనగరాలను మాత్రమే కాకుండా చిన్న పట్టణాలపై కూడా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక డాన్‌బాస్‌ పైనే తమ గురి అన్న రష్యా రూట్‌ మార్చింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా భీకరదాడులు చేస్తోంది. కీవ్‌ను నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టాయి రష్యా బలగాలు. రష్యా తాజా దాడుల్లో కీవ్‌ లోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. రష్యా దాడిలో కీవ్‌ లోని ఆయిల్‌ డిపో కూడా ధ్వంసమయ్యింది(Russia-Ukraine War). అటు పశ్చిమాన ఉన్న లీవ్‌లో ఆయిల్‌ డిపోను మిస్సైళ్లతో పేల్చేశారు. ఆయిల్‌ డిపో నుంచి భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. మరియాపోల్‌ నగరం పూర్తిగా రష్యా ఆధీనంలోకి వచ్చింది.

జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ రష్యాలో పాలన మార్పు తీసుకురావాలని NATO లేదా US అధ్యక్షుడు జో బిడెన్ లక్ష్యంగా పెట్టుకోలేదని అన్నారు. బిడెన్ శనివారం ప్రసంగంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి మాట్లాడుతూ “ఈ వ్యక్తి అధికారంలో ఉండలేడు.” వైట్ హౌస్ఇ, ఇతర యుఎస్ అధికారులు పుతిన్‌ను పడగొట్టాలని బిడెన్ వాస్తవానికి పిలవడం లేదని స్పష్టం చేశారు. 

రష్యా అధ్యక్షుడని మార్చేందుకు తాము కుట్ర చేస్తునట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అమెరికా వివరణ ఇచ్చింది. మరియాపోల్‌లో సెక్యూరిటీ బాధ్యతలను చెచెన్‌ ఫైటర్స్‌కు అప్పగించింది రష్యా సైన్యం. మరియాపోల్‌ పరిపాలన భవనంపై తమ జెండాను ఎగురవేశారు. యమకింకరులుగా పేరున్న చెచెన్‌ దళాన్ని యుద్దక్షేత్రంలోకి దింపారు పుతిన్‌.

ఇవి కూడా చదవండి: Yadadri Temple: మరికాసేపట్లో భక్తులకు యాదాద్రి నృసింహుడి నిజరూప దర్శనం.. తొలి భక్తునిగా సీఎం కేసీఆర్ ..

BJP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఏపీ, తెలంగాణల్లో యూపీ ఫార్ములా..