Russia – Ukraine War: ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడిన రష్యా.. గంటలోనే భారీ విధ్వంసం..
రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఆఖరిఘడియలు ఆరంభం అయ్యాయా? ఇక మూడో ప్రపంచయుద్ధం తప్పదా? ప్రపంచదేశాల్లో ఇప్పుడు ఇదే చర్చ కాక రేపుతోంది. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో రష్యా వాయుసేనల అతిభారీ యుద్ధ రాకెట్లను ప్రయోగించింది.
ఉక్రెయిన్ స్వాధీనమా? ప్రపంచ వినాశనమా? ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న బిగ్గెస్ట్ ఇష్యూ. గత పది నెలలుగా ఉక్రెయిన్‌ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ రష్యాకి కొరకుడుపడని కొయ్యగా మారింది. ఉక్రెయిన్‌కి అమెరికా తోడ్పాటు ప్రకటన ఉద్రిక్తతలు రాజేసింది. రష్యా – ఉక్రెయిన్ వార్‌తో వరల్డ్ వార్ టెన్షన్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఉక్రెయిన్‌పై మాస్కో అల్టిమేటం ఇచ్చింది. ప్రపంచ వినాశనానికైనా సిద్ధమంటూ భీకర ప్రకటన చేశారు పుతిన్. గెలుపొక్కటే లక్ష్యంగా రష్యా సైన్యం దూకుడుసాగిస్తోంది. అంతర్జాతీయ ఒప్పందాలకు అతీతంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో పుతిన్ వైఖరి యావత్ ప్రపంచాన్నీ నివ్వెరపరుస్తోంది.
యావత్ ప్రపంచాన్నీకుదిపేస్తోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో లక్షలాది మంది బలయ్యారు. రెండు దేశాల మధ్య చెలరేగిన యుద్ధకాంక్షలో ఒరిగిన నరకంఠాలెన్నో లెక్కకు చిక్కదు. దాదాపు ఏడాదిగా కొనసాగుతోన్న ఈ భయానక మానవ విధ్వంసం చివరి అంకానికి చేరనుందా ఇదే ఇప్పుడు బిగ్ న్యూస్‌గా మారింది. కీవ్‌ని ఆక్రమించేందుకు రష్యా దూకుడు పెంచింది. రష్యా హఠాత్తుగా కీవ్ నగరంపై భారీ రాకెట్లను ప్రయోగించింది. ఒక్క గంటలో 70 నుంచి 80 మిస్సైల్స్ తో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా.. 100 మందికి గాయాలయ్యాయి.
గత పదినెలల్లో కనీవినీ ఎరుగని రీతిలో రష్యా కీవ్‌పై నిన్న భారీ ఎటాక్స్‌కి దిగింది. వాయుసేనలు ప్రతాపం చూపాయి. ఒకే ఒక్క గంటలో భారీ విధ్వంసం సృష్టించింది రష్యా. విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేయడంతో అంధకారంలో మునిగిపోయింది కీవ్ నగరం. నీళ్ళు లేక జనం విలవిల్లాడుతున్నారు. అధికారికంగా మృతి చెందిన వారు కొందరే అయినా అనధికారిక మరణాలకు లెక్కేలేదు. ఏ మూల నుంచి ఏ రాకెట్ దూసుకొస్తుందోనని జనం కలుగుల్లో ఎలుకల్లా బిక్కు బిక్కు మంటున్నారు.
కీవ్‌లో ఒకటి కాదు రెండు కాదు.. మొత్తం రష్యన్ సైన్యంలోని సగభాగాన్ని మోహరించాడు పుతిన్. కీవ్ నగరంలో కాపుకాసిన రష్యన్ సేనలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. సరిహద్దు స్థావరాల నుంచి బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అత్యాధునిక రష్యన్ మిస్సైల్స్ దాడులతో ఉక్రెయిన్ గజగజలాడుతోంది. అసలింతకీ రష్యన్ న్యూ స్ట్రాటజీ ఏంటి? స్వాధీనమో.. ప్రపంచ విధ్వంసమో అన్న రష్యా ప్రకటనకు అర్థమేంటి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
2023లో ఆరంభంలో దాడులను ఉధృతం చేస్తానంటూ ఉక్రెయిన్‌పై రష్యా అల్టిమేటంతో తాజాగా కలకలం చెలరేగుతోంది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమ వాయుసేనలను బలోపేతం చేసుకోవడానికి సహకరించాలంటూ మిత్రదేశాలను కోరుతూ ప్రకటన విడుదల చేశారు. రష్యా మరిన్ని మిస్సైల్స్ ప్రయోగానికి సిద్ధంగా ఉందంటూ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..