Hypersonic Missile: రష్యా అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం.. సబ్‌మెరైన్‌ నుంచి హైపర్‌సోనిక్ క్షిపణి విజయవంతం

Russia Missile: రష్యా మరో బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించింది. అధునాతన క్షిపణి పరీక్షను నిర్వహించింది. మొట్టమొదటిసారి హైపర్‌సోనిక్ క్షిపణిని రష్యా అణు జలాంతర్గామి నుంచి విజయవంతంగా ప్రయోగించింది.

Hypersonic Missile: రష్యా అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం.. సబ్‌మెరైన్‌ నుంచి హైపర్‌సోనిక్ క్షిపణి విజయవంతం
Russia Hypersonic Missile
Follow us

|

Updated on: Oct 04, 2021 | 8:39 PM

Russia Hypersonic Missile: రష్యా మరో బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించింది. అధునాతన క్షిపణి పరీక్షను నిర్వహించింది. మొట్టమొదటిసారి హైపర్‌సోనిక్ క్షిపణిని రష్యా అణు జలాంతర్గామి నుంచి విజయవంతంగా నిర్వహించినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. సెవెరోద్‌విన్సిక్ జలాంతర్గామి నుంచి ప్రయోగించిన జిర్కోన్ క్షిపణి బారెంట్స్ సముద్రంలోని నిర్దేశిత డమ్మీ లక్ష్యాన్ని తాకిందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. జలాంతర్గామి నుంచి జిర్కాన్ క్షిపణిని రష్యా ప్రయోగించడం ఇది మొదటిసారి. నౌకాదళానికి చెందిన నౌక నుంచి గతంలో పలుసార్లు ఈ క్షిపణి ప్రయోగ పరీక్షలు రష్యా నిర్వహించింది. ధ్వని వేగం కన్నా ఎనిమిదిరెట్లు అధిక వేగంతో ప్రయాణించగల సామర్థ్యం జిర్కాన్ క్షిపణికున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.

కాగా, ఈ క్షిపణి 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదని, ఈ క్షిపణి ప్రవేశం ద్వారా రష్యా సైనిక సామర్థ్యం మరింత బలోపేతం కాగలదని పుతిన్ పేర్కొననారు. జిర్కాన్ పాటవ పరీక్షలు ఈ ఏడాది చివరి కల్లా పూర్తయి 2022లో ఇది రష్యా నౌకాదళంలో ప్రవేశించగలదని అధికారులు తెలిపారు. అమెరికా , ఫ్రాన్స్‌ , చైనా , బ్రిటన్‌తో పోటీ పడి రష్యా క్షిపణి పరీక్షలను నిర్వహిస్తోంది. కొత్తతరం ఆయుధ వ్యవస్థలో జిర్కోన్‌ హైపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణితో పోటీకి వచ్చే ఆయుధం ప్రపంచంలో ఎక్కడ లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. జిర్కోన్‌ హైపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని తయారు చేసిన రష్యా రక్షణ రంగ నిపుణులను పుతిన్‌ అభినందించారు. త్వరలో మరిన్ని అధునాతన క్షిపణి ప్రయోగాలు చేస్తామని రష్యా ప్రకటించింది. రష్యా చాలా క్షిపణి ప్రయోగాలు చేసింది. కాని తాజాగా చేసిన టెస్ట్‌ మాత్రం వాటితో పోలిస్తే విభిన్నమైనదని డిఫెన్స్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. సుదూర లక్ష్యాలను చేధించగల క్షిపణుల తయారీకి రష్యా మొగ్గు చూపుతోంది.

Read Also… Google: మీ ప్రతి కదలికను గమనిస్తున్నారు.. వారు అలా చెయ్యొద్దంటే.. మీరు ఇలా చేయాలి.. లేకుంటే అంతే..

Mumbai Drugs: మత్తు మాటున దాగిన మర్మాలెన్నో.. డ్రగ్స్‌ కేసులో వెలుగులోకి వస్తున్న సంచలనాలు.. ఎన్సీబీ కస్టడీకి ఆర్యన్‌!

Latest Articles
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?