Mumbai Drugs: మత్తు మాటున దాగిన మర్మాలెన్నో.. డ్రగ్స్‌ కేసులో వెలుగులోకి వస్తున్న సంచలనాలు.. ఎన్సీబీ కస్టడీకి ఆర్యన్‌!

Aryan in Mumbai Drugs Case: డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన షారూఖ్‌ ముద్దుల కొడుకు ఆర్యన్‌ఖాన్‌కు మూడు రోజుల ఎన్సీబీ కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. అక్టోబర్‌ 7 వరకు ఎన్సీబీ ఆర్యన్‌ను విచారిస్తుంది.

Mumbai Drugs: మత్తు మాటున దాగిన మర్మాలెన్నో..  డ్రగ్స్‌ కేసులో వెలుగులోకి వస్తున్న సంచలనాలు.. ఎన్సీబీ కస్టడీకి ఆర్యన్‌!
Mumbai Drugs Case
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 04, 2021 | 8:11 PM

Mumbai Drugs Case: డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన షారూఖ్‌ ముద్దుల కొడుకు ఆర్యన్‌ఖాన్‌కు మూడు రోజుల ఎన్సీబీ కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. అక్టోబర్‌ 7 వరకు ఎన్సీబీ ఆర్యన్‌ను విచారిస్తుంది. ముంబై ఖిలా కోర్టులో డ్రగ్స్‌ కేసుపై వాడివేడిగా వాదనలు జరిగాయి . ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్ తీసుకున్నాడని . క్రూయిజ్‌లో డ్రగ్స్‌ పార్టీ నిర్వాహకులతో అతడికి ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఎన్సీబీ తరపు న్యాయవాది వాదించారు.

అక్టోబర్‌ 11 వరకు ఆర్యన్‌తో పాటు ఫ్రెండ్స్‌ను కస్టడీకి ఇవ్వాలని ఎన్సీబీ కోరింది . 9 రోజుల కస్టడీకి ఎన్సీబీ కోరగా మూడు రోజుల కస్టడీకి మాత్రమే న్యాయస్థానం అంగీకరించింది. ఇదిలావుంటే, ముంబై క్రూయిజ్‌లో ఆర్యన్‌ పట్టబడ్డ సమయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ దొరికినట్టు కోర్టుకు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. ఆర్యన్‌ ఫోన్లో , వాట్సాప్‌ చాట్స్‌లో డ్రగ్స్‌కు సంబంధించి కీలక సమాచారం లభించిందని , ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ మాఫియాతో సంబంధాలు కూడా బయటపడినట్టు వెల్లడించింది. అందుకే ఆర్యన్‌ను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు ఎన్సీబీ తెలిపింది. ఇవాళ మరోసారి క్రూయిజ్‌లో ఎన్సీబీ అధికారులు సోదాలు చేశారు. పెద్ద ఎత్తున డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మరో 8 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఆర్యన్‌ దగ్గర డ్రగ్స్‌ దొరకలేదని అతడి తరపు న్యాయవాది సతీష్‌ మానెషిండే గట్టిగా వాదించారు. ఆర్యన్‌ స్నేహితుడి దగ్గర 6 గ్రాముల చరస్‌ దొరికిందని తెలిపారు. డ్రగ్స్‌ స్మగ్లరతో ఆర్యన్‌కు ఎటువంటి సంబంధాలు లేవని , క్రూయిజ్‌లో జరిగిన పార్టీకి స్పెషల్‌ గెస్ట్‌గా మాత్రమే వెళ్లాడని తెలిపాడు. అవసరమనుకుంటే క్రూయిజ్‌ను మొత్తం కొనుక్కునే సత్తా ఆర్యన్‌కు ఉందన్నాడు. డ్రగ్స్‌ వ్యాపారం చేసే ఖర్మ ఆర్యన్‌కు లేదన్నారు.

ఇదిలావుంటే, ముంబై క్రూయిజ్‌లో జరిగిన డ్రగ్ అండ్ రేవ్ పార్టీ.. ముంబై క్రూయిజ్‌లో నిన్న జరిగిన ఈ రేవ్‌ పార్టీలో అమ్మాయిలు అబ్బాయిలు మత్తులో ఊగిపోయారు. ఒక చేతిలో మందు బాటిల్.. మరో చేతిలో సిగరెట్ పట్టుకుని ఎంజాయ్ చేశారు. ఒంటిపై సరిగా బట్టలు కూడా లేకుండా తాగి ఊగిపోయారు. విలాసవంతమైన క్రూయిజ్ నౌక… ఉన్నది నడిసముద్రంలో… ఇసుకేస్తే రాలనంతగా టూరిస్టులు… అసలక్కడ ఏం జరుగుతుందో తెలియనంతగా డీజే సౌండ్స్.. మరోవైపు వెలుగు జిలుగులు.. ఇక ఎంజాయ్‌మెంట్‌కి హద్దేముంటుంది. డ్రగ్స్ తీసుకుంటూ ఆ మత్తులో ఊగిపోయారు. ఈ రేవ్ పార్టీలోనే ఆర్యన్ ఖాన్ అండ్ గ్యాంగ్‌ను ఇక్కడే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Read Also….  Supreme Court: నోయిడా ట్విన్‌ టవర్స్‌‌ను కూల్చాల్సిందే.. కీలక తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు