AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pandora Papers: పాండోరా పేపర్స్‌లో ప్రముఖుల రహస్య సంపద గుట్టు రట్టు.. దర్యాప్తుకు సిద్ధమైన కేంద్రం

Pandora Papers: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నేరగాళ్ల జాతకాలను బయటపెట్టిన ‘పాండోరా పేపర్స్” పెను సంచలనం సృష్టిస్తోంది.

Pandora Papers: పాండోరా పేపర్స్‌లో ప్రముఖుల రహస్య సంపద గుట్టు రట్టు.. దర్యాప్తుకు సిద్ధమైన కేంద్రం
Pandora Papers
Balaraju Goud
|

Updated on: Oct 04, 2021 | 10:10 PM

Share

Pandora Papers: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నేరగాళ్ల జాతకాలను బయటపెట్టిన ‘పాండోరా పేపర్స్” పెను సంచలనం సృష్టిస్తోంది. లక్షల మంది ప్రముఖుల ఆర్థిక లావాదేవీలను ‘పండోరా పేపర్స్” బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టు రట్టు చేస్తూ పనామా పేపర్స్ పేరుతో ఆదివారం రాత్రి వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖుల బాగోతాలను ప్రచురించింది. తక్కువ పన్ను ఉన్న దేశాలకు పెద్దఎత్తున తరలించిన రహస్య సంపద, అక్రమ పెట్టుబడుల వివరాలు ఇందులో పేర్కొంది. దేశ అధ్యక్షుల మొదలు బిలియనీర్లు, దౌత్యాధికారులు,రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ తారల వరకు.. 91 దేశాలకు చెందిన వేల మంది విదేశీ రహస్య ఆస్తులు, లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్ల వివరాలను ఇంటర్నేషనల్‌ కన్సోర్షియమ్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌ (ఐసీఐజే) విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే, ఆ పత్రాల్లో ఉన్న భారతీయులకు సంబంధించిన కేసులపై విస్తృతస్థాయిలో దర్యాప్తు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాండోరా పేపర్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన పన్ను ఎగవేత కేసులపై దర్యాప్తు జరపనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBDT) సోమవారం ప్రకటించింది. ఈమేరకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు సీబీడీటీ అధికార ప్రతినిధి వెల్లడించారు. సీబీడీటీ, ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్, రిజర్వు బ్యాంక్, ఫైనాన్షియన్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు చెందిన అధికారులు ఈ దర్యాప్తు బృందంలో భాగస్వాములు కానున్నారు. సీబీడీటీ డైరక్టర్ ీ బృందానికి నేతృత్వం వహిస్తారన్నారు. దీనిపై విచారణ పూర్తికాగానే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కేసుల దర్యాప్తులో భాగంగా పన్ను ఎగవేతదారుల సమాచారం పొందడం కోసం విదేశాల్లో ఉన్న అధికార పరిధిని కూడా ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు.

కాగా, పలువురు వ్యాపారవేత్తలతో సహా ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలు, దర్యాప్తు సంస్థల పరిశీలనలో ఉన్నవారు ఇలా అందరూ కలిపి 300 మందికి పైగా భారతీయులు పన్నుఎగవేతకు పాల్పడినట్లు ఈ పేపర్స్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. బ్రిటన్ లోని ఓ కోర్టులో దివాలా తీసినట్లు ప్రకటించిన భారత్ లోని ప్రముఖ వ్యాపారవేత్త అనీల్ అంబానీ, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ, బయోకాన్ ప్రమోటర్ కిరణ్ మజుందార్ షా భర్త, క్రికెట్ దిగ్గజసం సచిన్ టెండ్కూలర్ సహా పలువురి పేర్లు పండోరా పేపర్స్‌లో ఉన్నాయి.

అయితే, 2016లో బయటికొచ్చిన పనామా పేపర్లలో పన్ను ఎగవేతే లక్ష్యంగా వ్యక్తులు విదేశాల్లో ఏర్పాటుచేసిన కంపెనీల గురించి ఉంది. ఆ తర్వాత బయటికొచ్చిన పారడైజ్ పేపర్లలో..కార్పొరేట్ సంస్థలు సృష్టించిన దొంగ కంపెనీల గురించి ఉంది. అయితే అంతర్జాతీయ ఒత్తిడి నేపథ్యంలో అటువంటి డొల్ల కంపెనీల ఏర్పాటును అడ్డుకునేలా నిబంధనలు కఠినతరం చేశాయి. తాజాగా విడుదలైన పండోరా పేపర్లతో..ట్రస్టుల రూపాల్లో ఎలా పన్ను ఎగవేత జరుగుతుందో వెలుగులోకి వచ్చింది.

Read Also…  Gotu Kola: జ్ఞాపకశక్తికి ప్రకృతి వర ప్రసాదం ‘గోతుకోలా’.. అనేక వ్యాధులను నివారించే దివ్య ఔషధం