Hyderabad: లో దుస్తుల్లో బంగారం రవాణా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ముగ్గురి అరెస్టు
Hyderabad: ఆధునిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతున్నా.. గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. కొత్త కొత్త ఐడియాలతో స్మగ్లర్లు కస్టమ్స్ అధికారులకు చిక్కకుండా బంగారాన్ని
Hyderabad: ఆధునిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతున్నా.. గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. కొత్త కొత్త ఐడియాలతో స్మగ్లర్లు కస్టమ్స్ అధికారులకు చిక్కకుండా బంగారాన్ని తరలిస్తున్నారు. దీంతో గోల్డ్ స్మగ్లింగ్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు ఎంత పగడ్భంధీగా తనిఖీలు చేసినా అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. అధికారుల తనిఖీల్లో ఒక్కోసారి బంగారం పట్టుబడకపోయినా స్కానర్లు మాత్రం సైరన్ మోగిస్తున్నాయి. అయితే బంగారం ఎక్కడ దాచారన్నది గుర్తించడం అధికారులకు పరీక్షగానే మారుతోంది. తాజాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది.
కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు వ్యక్తులు 600 గ్రాములకుపైగా బంగారాన్ని లో దుస్తుల్లో తరలిస్తుండగా పట్టుబడ్డారు. కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఈ బంగారం ధర రూ.12.31 లక్షలుగా ఉంటుందని అంచనా. దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి 350 గ్రాముల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బంగారం స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. అధికారులకు తలకు మించిన భారమవుతుంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే విస్తుగొలిపే విధంగా ఉన్నాయి.
దుబాయ్ నుంచి వ్యక్తి 24 లక్షల విలువైన 495 గ్రాముల బంగారాన్ని.. చెప్పులు, ఫేస్ క్రీము, హెయిర్ స్ట్రయిట్‌నర్‌లో దాచుకుని తెచ్చాడు. కానీ పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని బంగారం స్వాధీనం చేసుకున్నారు. కొద్దిరోజుల కిందట ఓ మహిళ గర్భవతిగా నటిస్తూ మూడు కిలోల బంగారం దాచే ప్రయత్నం చేసింది. తెలివిమీరిన స్మగ్లర్లు ఒంటికి బంగారం పూత పూసుకుని.. దెబ్బ తాకిందని బ్యాండేజ్‌తో కవరింగ్ కూడా ఇస్తున్నారు.