Crime News: సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మృత్యు ఒడికి.. కాల్వలో ముగ్గురు యువకుల గల్లంతు..
Andhra Pradesh Crime News: సరదాగా ఈత కోసం కోసం వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మరణించగా.. మరొకరి ఆచూకీ లభ్యంకాలేదు. మరొకరి కోసం తుంగభద్ర
Andhra Pradesh Crime News: సరదాగా ఈత కోసం కోసం వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మరణించగా.. మరొకరి ఆచూకీ లభ్యంకాలేదు. మరొకరి కోసం తుంగభద్ర దిగువ కాల్వలో పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలంలో చోటుచేసుకుంది. స్నానం కోసం తుంగభద్ర కాల్వలోకి దిగిన ముగ్గురు కూడా గల్లంతయ్యారని పోలీసులు వెల్లడించారు. పెద్దతుంబళం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతుంబళం గ్రామంలోని జైన మందిరంలో రాజస్థాన్‌కు చెందిన సునీల్ (18), భవానీ (19), వినోద్ (28) మరో ఇద్దరు యువకులు పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో వారు ఈత కొట్టేందుకు సోమవారం సాయంత్రం సమీపంలోని తుంగభద్ర దిగువ కాల్వ వద్దకు వెళ్లారు. ఈత సరిగా రాకపోయినా నీటిలోకి దిగినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. కాల్వో ఈత కొడుతున్న సమయంలో.. ముందుగా సునీల్ అనే యువకుడు కాల్వలో కొట్టుకుపోయాడు. దీంతో అత్ని భవానీ కాపాడేందుకు ప్రయత్నించాడు. క్షణాల్లోనే అతనూ కూడా కొట్టుకుపోతున్నట్లు గుర్తించిన వినోద్.. నీళ్లలోకి దిగి రక్షించే ప్రయత్నం చేస్తుండగానే అతను కూడా గల్లంతయ్యాడు.
వీరితో పాటు ఈత కొట్టెందుకు వచ్చిన మిగతా ఇద్దరు యువకులు భయంతో ఆలయానికి వచ్చి తోటి సిబ్బందికి విషయాన్ని తెలిపారు. వారు వెంటనే పోలీసు, అగ్నిమాపక శాఖల సిబ్బందికి సమాచారమిచ్చారు. అనంతరం అక్కడికి చేరకున్న ప్రభుత్వ అధికారులు యువకుల ఆచూకీ కోసం గాలించారు. కొన్ని గంటల అనంతరం రాత్రి 9 గంటల తర్వాత భవానీ, సునీల్ మృతదేహాలను బయటకు వెలికితీశారు. వినోద్ ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.
Also Read: