Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లి కళ వచ్చేసిందే బాల.. వరుడు వస్తున్న ఆనందంలో ఈ వధువు ఏం చేసిందో చూశారా ?

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకం...ఈ తీపి జ్ఞాపకాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటారు. అందుకే అన్ని విషయాల్లోనూ

Viral Video: పెళ్లి కళ వచ్చేసిందే బాల.. వరుడు వస్తున్న ఆనందంలో ఈ వధువు ఏం చేసిందో చూశారా ?
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 04, 2021 | 9:56 PM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకం…ఈ తీపి జ్ఞాపకాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటారు. అందుకే అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటారు.. ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇక పెళ్లి ఇంట్లో ఉండే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంధువులు, స్నేహితులు.. చిన్నపిల్లలతో ఇళ్లంతా కోలహలంగా ఉంటుంది. సంగీతం.. డ్యాన్సులు, ఆటపాటలు ఇలా ఎన్నో సరదా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక పెళ్లి అనేది అమ్మాయి జీవితంలో మరింత ప్రత్యేకం..తన జీవితంలోకి మరో తెలియని వ్యక్తి మద్దతుగా వస్తుండడం.. తన బాధ్యతను తీసుకుంటూ.. అన్ని తానై వచ్చే అబ్బాయి రావడంతో అమ్మాయిల సంతోషం చెప్పలేం. ఇక పెళ్లి వేడుకలలో అమ్మాయిలు, అబ్బాయిల ఆనందం సరిహద్దులు లేనిదిగా ఉంటుంది. పెళ్లి సమయం రావడంతో.. కొందరు తమ ఆనందాన్ని వివిధ రకాలుగా వ్యక్తపరుస్తుంటారు. అలాగే ఇక్కడ ఓ వధువు కూడా.. తన ఆనందాన్ని చాలా గమ్మత్తుగా తెలియజేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో.. పెళ్లి వేడుక సమయానికి వరుడు పెళ్లి కూతురు ఇంటికి చేరుకున్నాడు. పెళ్లి కూతురు కుటుంబసభ్యులు, బంధువులు అంతాచేరి… మేళ తాళలతో సంగీతంతో వరుడుకు గ్రాండ్‏గా వెల్ కమ్ చెప్పారు. పెళ్లి కొడుకు రాక కోసం ఎదురుచూసిన వధువు.. అతను రావడంతో సంతోషంతో గంతులేసింది. తన ఆనందాన్ని డ్యాన్స్ రూపంలో చూపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. అమ్మాయి ఆనందంగా స్టెప్పులేయడం చూసి ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి. వీడియో..

Also Read: Big News Big Debate: ప్రకాష్‌ రాజ్ vs మంచు విష్ణు.. ‘మా’ గొడవలతో టాలీవుడ్‌ రోడ్డున పడిందా..?

Mumbai Drugs: మత్తు మాటున దాగిన మర్మాలెన్నో.. డ్రగ్స్‌ కేసులో వెలుగులోకి వస్తున్న సంచలనాలు.. ఎన్సీబీ కస్టడీకి ఆర్యన్‌!

RRR: ఆర్ఆర్ఆర్ కోసం వేగం పెంచిన రాజమౌళి.. ఎన్టీఆర్, చెర్రీలు ఇప్పటికే..