AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అపార్టమెంట్‎లో మంటలు.. ముగ్గురు యువకుల సాహసం.. స్పైడర్ మ్యాన్ లాగా మూడో అంతస్తు ఎక్కి..

సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ భవనంలో మంటలు చెలరేగాయి. అందులో వృద్ధుడు ఉన్నాడు. బయటకు రాలేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు...

Viral Video: అపార్టమెంట్‎లో మంటలు.. ముగ్గురు యువకుల సాహసం.. స్పైడర్ మ్యాన్ లాగా మూడో అంతస్తు ఎక్కి..
Fired
Srinivas Chekkilla
|

Updated on: Oct 04, 2021 | 8:44 PM

Share

సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ భవనంలో మంటలు చెలరేగాయి. అందులో వృద్ధుడు ఉన్నాడు. బయటకు రాలేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడే ఉన్న ముగ్గురు యువకులు సాహసం చేసి ఆ వృద్ధుడిని కాపాడారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‎గా మారింది.

ఫ్రాన్స్‌లోని ఓ నగరంలో అపార్టుమెంట్ ఉంది. ప్రమాదవశాత్తు ఆ అపార్టుమెంట్‎లో మంటలు చెలరేగాయి. అపార్టుమెంట్ వాసులు చాలా మంది కిందకి దిగేశారు. కానీ మూడో అంతస్తులో ఓ వృద్ధుడు చిక్కుకుపోయాడు. సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడే పార్కులో ఉన్న రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ చెచ్న్యాకు చెందిన ముగ్గురు యువకులు అ వృద్ధుడిని కాపాడానికి ప్రయత్నం మొదలు పెట్టారు. వారు ఎలాంటి శిక్షణ కూడా తీసుకోలేదు. భద్రతా సామాగ్రి ఉపయోగించకుండా మూడో అంతస్తు ఎక్కి వృద్ధుడిని కాపాడారు.

ఎలాంటి భయం లేకుండా, మంటల్లో చిక్కుకున్న వ్యక్తికి సహాయం చేయడానికి వారు భవనాన్ని ఎక్కుతున్న క్రమాన్ని స్థానికులు వీడియోలో బంధించారు. మొదటగా వృద్ధుడిని బాల్కనీ వైపు రమ్మని పిలిచారు. కానీ అతడు కదలలేకపోయాడు. ఓ వ్యక్తి బాల్కనీలోకి దూకి వృద్ధుడిని ఎత్తుకుని పక్క బాల్కనీలో ఉన్న ఇద్దరు స్నేహితులకు అందించాడు. వృద్ధున్ని జాగ్రత్తగా పక్క అపార్టుమెంట్‎కు తీసుకెళ్లారు. సాహసం చేసిన డోంబేవ్ జాంబులాట్, ఉల్లౌబేవ్ అస్లా, అహ్మడోవ్ ముహ్సిన్జోన్ స్థానికులు అభినందించారు. ఈ వీడియోను ఇన్‎స్టాగ్రామ్‎లో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్ అయింది.

Read Also.. Viral Video: ప్రాణాలకు తెగించి కుక్కను కాపాడిన వ్యక్తి.. అసలు విషయం తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..