Booster Dose: ఆ దేశంలో మూడో డోసు వ్యాక్సిన్‌ ప్రారంభం.. మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. !

Booster Dose: కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే చాలా దేశాలను వ్యాక్సిన్‌ కొరత వేస్తోంది. ఇదే సమయంలో మరికొన్ని దేశాలు..

Booster Dose: ఆ దేశంలో మూడో డోసు వ్యాక్సిన్‌ ప్రారంభం.. మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. !
Covid Vaccine
Follow us
Subhash Goud

|

Updated on: Jul 02, 2021 | 6:17 AM

Booster Dose: కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే చాలా దేశాలను వ్యాక్సిన్‌ కొరత వేస్తోంది. ఇదే సమయంలో మరికొన్ని దేశాలు మాత్రం మూడో డోసును పంపిణీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్‌ డోసు పంపిణీ చేపడుతున్నట్లు రష్యా ప్రకటించింది. ప్రపంచంలో తొలికరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసుకున్న రష్యా.. మూడో డోసు పంపిణీలోనూ మొదటి స్థానంలో ఉంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తొలిసారిగా రిజిస్టర్‌ చేసుకున్న దేశంగా నిలిచింది రష్యా. ప్రస్తుతం అక్కడ కరోనా మహమ్మారి విజృంభణ మరోసారి మొదలైంది. దీంతో అప్రమత్తమైన రష్యా ప్రభుత్వం.. మూడో డోసును ఇవ్వాలని నిర్ణయించింది. ఇందు కోసం వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాలను సవరించింది. రెండు డోసులు తీసుకుని ఆరు నెలల కంటే ఎక్కువ సమయం గడిచిన వారు మూడో డోసు తీసుకోవాలని సూచించింది.

అంతేకాకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి బూస్టర్‌ డోసులు ఇవ్వాలని భావిస్తోంది. రష్యా రాజధాని మాస్కోలో జూలై 1 నుంచి బూస్టర్‌ డోసు పంపిణీని ప్రారంభించారు. కొత్తగా వెలుగు చూస్తున్న వేరియంట్లను దృష్టిలో ఉంచుకుని శరీరంలో యాంటీబాడీల స్థాయిలను అధిక మొత్తంలో ఉంచేందుకు రీ-వ్యాక్సినేషన్‌ ప్రారంభించినట్లు గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ గిన్ట్స్‌బర్గ్‌ తెలిపారు.

కాగా, రష్యాలో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా మళ్లీ మొదలయ్యాయి. కొత్తగా వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌తో పలు దేశాల్లో వైరస్‌ విజృంభణ మళ్లీ మొదలైంది. గతకొన్ని రోజులుగా రోజు 650కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లలో అధికంగా రెండు డోసుల్లో తీసుకునేవి ఉన్నాయి. తొలిడోసు వల్ల వృద్ధి చెందే యాంటీబాడీలు ఆరునెలల తర్వాత క్షీణిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Covid 19 Vaccine; భారత్‌లో ముమ్మరంగా వ్యాక్సినేషన్.. హైదరాబాద్‌లో 18 ఏళ్లు పైబడిన వారందరికి టీకా.. త్వరలో అందుబాటులోకి రానున్న జైకోవ్‌ డి

Covishield Vaccine: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొవిషీల్డ్‌ రెండో డోసు వ్యవధిని పెంచుతూ నిర్ణయం