ట్రావెల్ పాస్ వివాదం నుంచి మినహాయింపు ..? కోవీషీల్డ్ వ్యాక్సిన్ కి స్విట్జర్లాండ్ సహా ఈయూ లోని 8 దేశాల ఆమోదం
కోవీషీల్డ్ వ్యాక్సిన్ ని స్విట్జర్లాండ్ సహా యూరోపియన్ యూనియన్ లోని ఎనిమిది దేశాలు ఆమోదించాయి. ఆస్ట్రియా, జర్మనీ, స్లోవేనియా, గ్రీస్, ఐస్ ల్యాండ్, స్పెయిన్ దీన్ని ఆమోదించినట్టు ఈయూ వర్గాలు తెలిపాయి. అంటే దాదాపు ట్రావెల్ పాస్ వివాదం నుంచి ఈ టీకామందు బయట పడింది.
కోవీషీల్డ్ వ్యాక్సిన్ ని స్విట్జర్లాండ్ సహా యూరోపియన్ యూనియన్ లోని ఎనిమిది దేశాలు ఆమోదించాయి. ఆస్ట్రియా, జర్మనీ, స్లోవేనియా, గ్రీస్, ఐస్ ల్యాండ్, స్పెయిన్ దీన్ని ఆమోదించినట్టు ఈయూ వర్గాలు తెలిపాయి. అంటే దాదాపు ట్రావెల్ పాస్ వివాదం నుంచి ఈ టీకామందు బయట పడింది. భారతీయ వ్యాక్సిన్లను, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను మీరు గుర్తిస్తే మీ దేశాలనుంచి వ్యాక్సిన్ తీసుకుని వచ్చేవారిని తప్పనిసరి క్వారంటైన్ నుంచి మినహాయిస్తామని ఇండియా ఈయూ సభ్య దేశాలకు తెలిపింది. అటు ఇండియాకు సంబంధించిన అన్ని అధికారిక వ్యాక్సిన్లను తాము గుర్తిస్తామని ఎస్టోనియా తెలిపింది. మా దేశంలో వ్యాక్సిన్ తీసుకున్నవారిని కూడా ట్రావెల్ పాస్ విధానం నుంచి మినహాయించాలని భారత ప్రభుత్వం ఈయు సభ్యదేశాలను కోరినట్టు తెలిసింది.కోవీసషీల్డ్ లేదా కొవాగ్జిన్ ఏ టీకామందు తీసుకున్నా ఈ వెసులుబాటు కల్పించాలని కోరినట్టు సమాచారం.. కాగా కోవీషీల్డ్ వ్యాక్సిన్ ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించగా.. కొవాగ్జిన్ టీకామందును కొన్ని దేశాలు మాత్రం అంగీకరించాయి.
అయితే ఇంకా వివిధ దేశాల ఆమోదం కోసం తాము ప్రయత్నిస్తున్నామని భారత్ బయో టెక్ వెల్లడించింది. త్వరలో తమ టీకామందుకు వాటి ఆమోదం లభించగలదని పేర్కొంది. ఇలా ఉండగా కోవిన్ పోర్టల్ ద్వారా తాము జారీ చేసే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను నిర్ధారించుకోవాలి భారత ప్రభుత్వం ఆయా దేశాలను కోరుతోంది. ఇప్పటికే ఈ మేరకు వాటికి లేఖలు రాసింది. ఆ దేశాల నుంచి సానుకూల ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఎమ్మార్వో గా రవి తేజ..షూటింగ్ షురూ చేసిన మాస్ మహా రాజా Ravi Teja 68 movie video.