ఆదిత్య 369 లా.. కళ్యాణ్ రామ్ బింబిసార..! మూడు పాత్రలలో కనిపించనున్న నందమూరి హీరో :Kalyan Ram Bimbisara Movie.
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ త్వరలో హిస్టారికల్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. బింబిసార అనే సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తుంటాడు కళ్యాణ్ రామ్.
పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ఆ రేంజ్ హిట్ ను అందుకోలేక పోయాడు. ఇక ఇప్పుడు హిస్టారికల్ సినిమాతో అలరించడానికి సిద్దమవుతున్నాడు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్రబృందం మోషన్ పోస్టర్ లింకును పంచుకుంది. ఇందులో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సంధర్భంగా ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో కళ్యాణ్ మూడు పాత్రలలో కనిపిస్తాడని టాక్. కళ్యాణ్ రామ్ ఇదివరకు డ్యూయెల్ రోల్ చేసాడు కానీ త్రిపాత్రభినయం ఇదే ఫస్ట్ టైమ్ అవుతుంది.బింబిసార సినిమా మూడు పార్ట్స్ అని.. కొన్ని రెండు పార్ట్స్ గా రాబోతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ తాజాగా ఈ చిత్రం కేవలం ఒకే పార్ట్ ఉంటుందని సీక్వెల్స్ ఉండవని వినికిడి.
మరిన్ని ఇక్కడ చూడండి: వైరల్ అవుతున్న వరుణ్ బాక్సింగ్ వీడియో…! గని సినిమా కోసం కష్టపడుతున్న మెగా ప్రిన్స్ :video of Varun Tej.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
