Covid-19 Vaccine: కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే ముందు పెయిన్‌ కిల్లర్స్‌ వాడవద్దు.. హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో

Covid-19 Vaccine: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్‌లో 18 ఏళ్లు దాటిన వారికి కూడా టీకాలు వేస్తోంది. అయితే టీకా వేసుకున్న తర్వాత చాలా..

Covid-19 Vaccine: కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే ముందు పెయిన్‌ కిల్లర్స్‌ వాడవద్దు.. హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో
Covid 19 Vaccine
Follow us
Subhash Goud

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 02, 2021 | 9:23 AM

Covid-19 Vaccine: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్‌లో 18 ఏళ్లు దాటిన వారికి కూడా టీకాలు వేస్తోంది. అయితే టీకా వేసుకున్న తర్వాత చాలా మందికి జ్వరం, ఒళ్లు నొప్పులు రావడం సాధారణంగా మారింది. అయితే వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ముందు కొందరు పెయిన్‌ కిలర్స్‌ ను వాడుతున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇవి వాడటం వల్ల వ్యాక్సిన్‌ సమర్ధతపై తీవ్ర ప్రభావితం చేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత చాలా మందికి జ్వరం, ఒళ్లు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి లాంటివి సాధారణంగా వస్తున్నాయి. అయితే వీటికి వ్యాక్సినేషన్‌ తర్వాత పెయిన్‌ కిల్లర్స్‌ లేదా పారా సెటమాల్‌ ఉపయోగిస్తే సమస్య లేదు గానీ.. వ్యాక్సిన్‌కు ముందు ఇవి వాడవద్దని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది.

చాలా మంది సోషల్‌ మీడియాలో నకిలీ పోస్టులు పెడుతుండటంపై వైరల్‌ కావడంతో ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేసింది. సోషల్‌ మీడియాలో పోస్టులను చూసి వ్యాక్సిన్ వేసుకోవ‌డానికి ముందు పెయిన్ కిల్లర్ తీసుకుంటున్నారని, కానీ అలా చేయడం మంచిది కాదని తెలిపింది. ఒక వేళ ఒళ్లు నొప్పులు ఉంటే వైద్యులను సంప్రదించాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.

కాగా, కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఒళ్లు నొప్పులు, జ్వరం రావడం అనేది జరుగుతుందని, అలాంటి వాటికి భయపడి టీకా వేసుకోకుండా ఉండటం మంచిది కాదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎవరైనా సరే వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిదన్నారు. వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల శరీరంలో యంటీబాడీలు పెరిగి వైరస్‌ను అడ్డుకుంటాయని తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

ట్రావెల్ పాస్ వివాదం నుంచి మినహాయింపు ..? కోవీషీల్డ్ వ్యాక్సిన్ కి స్విట్జర్లాండ్ సహా ఈయూ లోని 8 దేశాల ఆమోదం

Malaria: ఏడు దశాబ్దాల నిరంతర ప్రయత్నం..మలేరియా రహిత దేశంగా చైనా!