Hot Masala Kichidi : ఇంట్లోనే వేడి వేడి మసాలా కిచిడీని తయారు చేయండి..! ఎలాగో తెలుసుకోండి..
Hot Masala Kichidi : వర్షాకాలంలో ఇంట్లో వేడి వేడిగా ఏదైనా తింటే ఆ కిక్కే వేరప్ప..! అందుకే సులువుగా అందరు చేసే మసాలా కిచిడీ గురించి
Hot Masala Kichidi : వర్షాకాలంలో ఇంట్లో వేడి వేడిగా ఏదైనా తింటే ఆ కిక్కే వేరప్ప..! అందుకే సులువుగా అందరు చేసే మసాలా కిచిడీ గురించి తెలుసుకుందాం. దీనిని తక్కువ సమయంలో సులువుగా చేయవచ్చు. అంతేకాదు ఇది చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యకరమైనది కూడా. దాదాపుగా కిచిడీని చాలామంది ఇళ్లలోనే చేస్తారు. ఉదయం పూట కొంతమంది టిఫిన్‌కి బదులుగా కిచిడీని తింటారు. రోజులో మూడ్ బాగా లేకున్నా కిచిడీ తింటే సరైపోతుంది. ఖిచ్డి ఆరోగ్యకరమైన బియ్యం, కూరగాయల వంటకం. దీనిని చాలా మసాలా దినుసులను వేసి చేయడం వల్ల రుచిగా ఉంటుంది. ఇంట్లో కారంగా, రుచికరమైన మసాలా ఖిచ్డిని తయారు చేయడమే కాకుండా రెసిపీని కూడా సిద్దం చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
1. ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. తరువాత 1 అంగుళం దాల్చినచెక్క, 1 లవంగం, చిటికెడు ఆసాఫోటిడా, తరిగిన పచ్చిమిర్చి, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపండి.
2. మీడియం సైజు ఉల్లిపాయ పేస్ట్, తరిగిన టమాటా ముక్కలుగా, 3-4 స్పూన్ గ్రీన్ బఠానీలు, 1 క్యారెట్, 1 క్యాప్సికం సన్నని మంటపై కొన్ని నిమిషాలు వేయించాలి.
3. ఇప్పుడు మసాలా దినుసులను కుక్కర్‌లో వేయాలి. వీటిలో స్పూన్ పసుపు, స్పూన్ మిరప పొడి, స్పూన్ గరం మసాలా, రుచి ప్రకారం ఉప్పు కలపండి.
4. చివరగా కప్పు రైస్, కప్ మూంగ్ దాల్, 3 కప్పుల నీరు కలపాలి. మీడియం మంట మీద 4-5 ఈలలు వరకు ఉడికించి వేడి వేడిగా వడ్డించండి.