Spiny Gourd Benfits : బోడకాకరకాయలో ఎన్నో ఔషధ గుణాలు..! మరెన్నో లాభాలు.. రెయినీ సీజన్‌లో ఒక్కసారైనా తినాల్సిందే..
Spiny Gourd Benfits : కరోనా కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. దీని నుంచి బయటపడాలంటే రోగనిరోధక శక్తిని
Spiny Gourd Benfits : కరోనా కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. దీని నుంచి బయటపడాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే సరైన మార్గం. మొదటి వేవ్ నుంచి రోండో వేవ్ వరకు కరోనా బాధితులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరం చూశాం. చాలా మంది ట్రీట్‌మెంట్ అందక మరణించారు కూడా.. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జనాలు మళ్లీ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు, నిపుణులు ప్రజలను తరచూ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం అందుకోసం మంచి ఆహారం తీసుకోవాలి. అయితే రెయినీ సీజన్‌లో మనకు ఒక ఆయుర్వేద కూరగాయ లభిస్తుంది. దాని పేరు బోడకాకరకాయ. ఈ కాలంలో దీనిని ఒక్కసారైనా తినాలి. ఎన్నో ఆయుర్వేద లక్షణాలు ఉన్న ఈ కూరగాయ తినడం వల్ల శరీరానికి చాలా మంచి జరుగుతుంది. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
బోడకాకరకాయను చాలా ప్రాంతాల్లో చాలా పేర్లతో పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బోడకాకరకాయతో ఫేమస్. దీంట్లో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ ఎ, విటమిన్ బి 1, బి 2, బి 3, బి 5, బి 6, బి 9, బి 12, విటమిన్ సి, విటమిన్ డి 2, 3, విటమిన్ హెచ్, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. అంతేకాదు ఇది మనకు చాలా బలాన్ని ఇస్తుంది. చాలా శక్తివంతమైనది. బోడకాకర అనేక రకాల వ్యాధులకు దివ్యఔషధం. ఆయుర్వేదంలో కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు, కడుపు ఇన్ఫెక్షన్, పైల్స్, కామెర్లు, డయాబెటిస్, హెర్పెస్, దురద, పక్షవాతం, జ్వరం, వాపు, అపస్మారక స్థితి, పాము కాటు, కంటి సమస్య, క్యాన్సర్, రక్తపోటు వంటి అనేక భయంకరమైన వ్యాధులలో దీనిని ఉపయోగిస్తారు.
బోడ కాకరను సాధారణ కూరగాయగానే కాకుండా దీని వేర్లు, పువ్వులు, రసం, ఆకులు మొదలైనవి అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. బోడకాకరకాయకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. వివిధ ధరల వద్ద ఇవి లభిస్తాయి. ఇది కిలోకు రూ .80 నుంచి 150 రూపాయల వరకు పలుకుతుంది. వాస్తవానికి దాని ధర సీజన్, దాని లభ్యతపై ఆధారపడి ఉంటుంది. మంచి ఆరోగ్యం కోసం మంచి జీవనశైలి మాత్రమే కాకుండా మంచి ఆహారం, క్రమమైన వ్యాయామం కూడా అవసరం.