VIRAL VIDEO : ఇలాంటి చికెన్ ప్రియుడ్ని మీ జీవితంలో చూసి ఉండరు..! దొంగలు పడ్డా అలాగే..
VIRAL VIDEO : మీరు భోజన ప్రియులైతే ఏం చేస్తారు.. ఇష్టమైన రెస్టారెంట్‌కి వెళ్లి నచ్చిన డిష్ ఆర్డర్ చేసి తింటూ ఎంజాయ్ చేస్తుంటారు..
VIRAL VIDEO : మీరు భోజన ప్రియులైతే ఏం చేస్తారు.. ఇష్టమైన రెస్టారెంట్‌కి వెళ్లి నచ్చిన డిష్ ఆర్డర్ చేసి తింటూ ఎంజాయ్ చేస్తుంటారు.. అయితే సరిగ్గా అదే సమయంలో ఓ దొంగ మీ వద్దకు వచ్చి మీ పర్సు, సెల్‌ఫోన్ ఇమ్మని అడిగితే మీరు ఏం చేస్తారు.. ఎవ్వరైనా సరే ఒక్కసారిగా షాక్ అవుతారు. తినడం ఆపి ఏం చేయాలో ఆలోచిస్తారు. సరిగ్గా ఇలాంటి అనుభవమే రెస్టారెంట్‌లో ఓ వ్యక్తికి ఎదురైంది. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే అందరు నోరెళ్లబెడతారు.. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
యూట్యూబ్‌లో షేర్ చేసిన ఈ వైరల్ వీడియో ఇప్పటికే 235 కే వ్యూస్ వచ్చాయి. 1 నిమిషం 11 సెకన్ల క్లిప్‌లో దొంగ హెల్మెట్ ధరించి రెస్టారెంట్‌లోకి ప్రవేశించి ఆయుధాన్ని తీసుకొని అందరిని బెదిరించడం మొదలు పెడతాడు. రెస్టారెంట్ అంతా గందరగోళం ఏర్పడుతుంది. కొంతమంది అక్కడి నుంచి తప్పించుకోవడం మనం చూస్తాం. అయితే ఆ దొంగ ఓచికెన్ తినే వ్యక్తి దగ్గరికి వచ్చి మీ ఫోన్, డబ్బులు ఇవ్వమని అడిగితే సింపుల్‌గా అన్నీ ఇస్తుంటాడు కానీ చికెన్ తినడం మాత్రం ఆపడు. చాలా ప్రశాంతంగా ఎవరితో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తాడు. చికెన్ రుచిని ఆస్వాదిస్తూ ఉంటాడు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు వీడియోను ఇతరులకు షేర్ చేస్తున్నారు. అయితే కొన్ని కామెంట్స్ వింతగా అనిపిస్తున్నాయి. అది అతడి చివరి చికెన్ కావొచ్చని కొంటె కామెంట్ పెడుతున్నారు. కొంతమంది దొంగ ఏమి చేస్తాడని టెస్ట్ చేసి ఉండొచ్చని అన్నారు. మరికొంతమంది అతడికి చికెన్ రుచి చాలా బాగానచ్చి ఉండవచ్చని పేర్కొన్నారు. ఏది ఏమైనా అతడి వ్యవహరించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.