Pooja Hegde : దళపతి ‘బీస్ట్’ కోసం చెన్నైకు చెక్కేసిన బుట్టబొమ్మ.. ఎయిర్ పోర్ట్ లో పూజా సందడి

బుట్టబొమ్మ పూజ హెగ్డే ఇప్పుడు తెలుగు ,తమిళ్ , హిందీ భాషల్లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ.. అటు హిందీలోనూ భారీ సినిమాలను లైన్ లో..

Pooja Hegde : దళపతి 'బీస్ట్' కోసం చెన్నైకు చెక్కేసిన బుట్టబొమ్మ.. ఎయిర్ పోర్ట్ లో పూజా సందడి
Pooja
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 02, 2021 | 10:35 AM

Pooja Hegde : బుట్టబొమ్మ పూజాహెగ్డే  ఇప్పుడు తెలుగు ,తమిళ్, హిందీ భాషల్లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ.. అటు హిందీలోనూ భారీ సినిమాలను లైన్ లో పెడుతుంది. అలాగే ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ అదృష్టం పరీక్షించుకోనుంది. తమిళ్ సినిమాతోనే ఈ ముద్దగుమ్మ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. జీవ హీరోగా నటించిన మాస్క్ సినిమాలో పూజా హెగ్డే  హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళ్ లో దళపతి విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమాలోనూ పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిలిచిపోయిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. 1960ల నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ నడుస్తుంది. ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్ – యూవీ క్రియేషన్స్ – టీ సిరీస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రానుంది.

హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షెడ్యూల్ లో పూజాహెగ్డే కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు చెన్నైకి చెక్కేసిందని తెలుస్తుంది. విజయ్ తో కలిసి నటిస్తున్న ‘బీస్ట్’ షూటింగ్ లో పూజా జాయిన్ అయినట్లు సమాచారం. చెన్నైలో జరుగుతున్న ఈ షెడ్యూల్ లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో విజయ్ – పూజా లపై సాంగ్ ను చిత్రీకరించనున్నారు. షూటింగ్ కోసం చెన్నై లో ల్యాండ్ అయిన ఈ అమ్మడు అక్కడకు మినీ స్కట్ లో వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Gayatri Rao: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి.. ఇప్పుడెలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..

Shyam Singha Roy: షూటింగ్ షురూ చేసిన శ్యామ్ సింగరాయ్.. బ్యాక్ ఇన్ యాక్షన్ అంటూ పోస్టర్

Srinu Vaitla: గ్యాప్ రాదు రానివ్వను అంటున్న శ్రీను వైట్ల.. మూడు సినిమాలను లైన్లో పెట్టిన డైరెక్టర్