Srinu Vaitla: గ్యాప్ రాదు రానివ్వను అంటున్న శ్రీను వైట్ల.. మూడు సినిమాలను లైన్లో పెట్టిన డైరెక్టర్

ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన శ్రీను వైట్ల.. ఈ మధ్య కాస్త వెనుకబడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న శ్రీను వైట్ల..

Srinu Vaitla: గ్యాప్ రాదు రానివ్వను అంటున్న శ్రీను వైట్ల.. మూడు సినిమాలను లైన్లో పెట్టిన డైరెక్టర్
Srinu Vaitla
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 02, 2021 | 8:03 AM

srinu vaitla: ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన శ్రీను వైట్ల.. ఈ మధ్య కాస్త వెనుకబడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న శ్రీను వైట్ల ఆతర్వాత అంత స్థాయిలో హిట్ ను అందుకోలేక పోతున్నాడు. వెంటనే మహేష్ బాబుతో ఆగడు సినిమా చేసాడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆతర్వాత శ్రీను వైట్లకు ఆఫర్లు తగ్గాయి. మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి మిస్టర్ అనే సినిమా చేసాడు శ్రీను వైట్ల ఆ సినిమా కూడా దారుణంగా నిరాశపరిచింది. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు వరుస ప్రయోజెక్ట్లను లైన్ లో పెడుతున్నాడు. గతంలో శ్రీను వైట్ల డైరెక్షన్ లో మంచు విష్ణు నటించిన ఢీ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తర విషయాలను తెలిపారు. ‘ఢీ’ సినిమా పూర్తిస్థాయి వినోదభరితం చిత్రం. ‘డి అండ్ డి’ సినిమా అంతకు మించిన ఎంటర్టైన్ మెంట్ ను ఇస్తుంది. అందుకనే ‘డబుల్ డోస్’ అనే క్యాప్షన్ పెట్టాము.ఈ సినిమా తర్వాత గ్యాప్ లేకుండ కమిట్ అయిన మిగిలిన సినిమాలను కూడా పూర్తి చేస్తాను అన్నారు. అలాగే.. నాకు గ్యాప్ వచ్చిందని అనుకుంటున్నారు .. కానీ అందులో నిజం లేదు. కరోనా కారణంగానే వెంటనే నేను సెట్స్ పైకి వెళ్లలేకపోయాను. ‘డి అండ్ డి’ కాకుండా ఈ లాక్ డౌన్ సమయంలో మరో రెండు స్క్రిప్టులను కూడా రెడీ చేసుకున్నాను అని తెలిపారు శ్రీను వైట్ల. ఇక నా నుంచి రాబోతున్న మూడు సినిమాలు ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్లే అని శ్రీను వైట్ల అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

AHA OTT: ఈ వీకెండ్‌ ‘ఆహా’తో చిల్‌ అవ్వండి.. ఏకే రోజు 15 సినిమాలు. ‘లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండాలి కదండి’.

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు ఊరట..

ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఎమ్మార్వో గా రవి తేజ..షూటింగ్ షురూ చేసిన మాస్ మహా రాజా Ravi Teja 68 movie video.