Shyam Singha Roy: షూటింగ్ షురూ చేసిన శ్యామ్ సింగరాయ్.. బ్యాక్ ఇన్ యాక్షన్ అంటూ పోస్టర్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. గత ఏడాది వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఈ సారి వరుస సినిమాలతో అలరించబోతున్నాడు.

Shyam Singha Roy: షూటింగ్ షురూ చేసిన శ్యామ్ సింగరాయ్.. బ్యాక్ ఇన్ యాక్షన్ అంటూ పోస్టర్
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 02, 2021 | 11:14 AM

Shyam Singha Roy

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. గత ఏడాది వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఈ సారి వరుస సినిమాలతో అలరించబోతున్నాడు. శ్యామ్ సింగరాయ్ తోపాటు శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ లను చాలా బ్యాలెన్స్డ్ గా కంప్లీట్ చేస్తున్నాడు ఈ నేచురల్ స్టార్ ఇప్పటికే టక్ జగదీష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కు సిద్ధం అయ్యింది. ఇక శ్యామ్ సింగరాయ్ విషయానికొస్తే.. ఈ సినిమాకు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ముగ్గురు అందమైన భామలు సాయి పల్లవి – కృతి శెట్టి – మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నాడు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ‘శ్యామ్ సింగ రాయ్’ కోసం కలకత్తా కాళీ మాత గుడితో సహా కొన్ని వీధులను గుర్తు చేసేలా దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకమైన సెట్ వేశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సినిమా సెట్ దెబ్బతిన్నది. ఇటీవలే సెట్ ను పునరుద్ధరించారు.కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మిక్కీజే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు .

మరిన్ని ఇక్కడ చదవండి:

ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఎమ్మార్వో గా రవి తేజ..షూటింగ్ షురూ చేసిన మాస్ మహా రాజా Ravi Teja 68 movie video.

Chiranjeevi Tweet: ‘తెలుగుతనానికి ఆయన నిలువెత్తు రూపం’… వెంకయ్య నాయుడు పుట్టిన రోజు చిరు ట్వీట్‌..

Kangana Vs Tapsee: ‘మనుషుల కుళ్లు స్వభావానికి ఇదో నిదర్శనం’.. తాప్సీ, కంగనాల మధ్య తారా స్థాయికి చేరిన మాటల యుద్ధం.