Gayatri Rao: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి.. ఇప్పుడెలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..

సెన్సబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీడేస్ సినిమా మంచి హిట్ అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని క్యారెక్టర్స్ యువతకు చాలా దగ్గరగా ఉండటంతో అంతా సినిమాకు కనెక్ట్ అయ్యారు.

Gayatri Rao: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి.. ఇప్పుడెలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..
Gayatri
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 02, 2021 | 10:13 AM

Gayatri Rao: సెన్సబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీడేస్ సినిమా మంచి హిట్ అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని క్యారెక్టర్స్ యువతకు చాలా దగ్గరగా ఉండటంతో అంతా సినిమాకు కనెక్ట్ అయ్యారు. ఇంజనీరింగ్ కాలేజ్ లో స్నేహం, ప్రేమ, గొడవలు అన్నీ యువతను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో నటించిన అందరు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. అలాగే వరుణ్ సందేశ్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇక నిఖిల్ హీరోనా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఈ సినిమాలో అప్పుగా నటించిన అమ్మాయి గుర్తుందా.. అప్పుగా నటించిన ఆ అమ్మడు పేరు గాయత్రి రావు. సీనియర్ నటి అయిన బెంగళూరు పద్మ కూతురు ఈమె.

హ్యాపీడేస్ సినిమా తర్వాత గాయత్రి రావుకు వరుస ఆఫర్లు వస్తాయని అంతా అనుకున్నారు… కానీ ఆమెను అవకాశాలు పలకరించలేదు. ఆతర్వాత చాలా కాలానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. అందులో హీరోయిన్ స్నేహితురాలిగా నటించింది గాయత్రి రావు. ఆ సినిమా కూడా ఈమెకు వరుస ఆఫర్లు తెచ్చి పెట్టలేదు. ఆతర్వాత చిన్నచిన్న సినిమాల్లో నటించింది. ఇక 2019 లో పెళ్లి చేసుకుని చెన్నైలో స్థిరపడింది. పెళ్లితర్వాత గాయత్రి రావు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. గాయత్రి రావు పెళ్ళిఫోటోలు, ఆమె బరువు పెరిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.

Gayatri .

Gayatri 

Gayatri Rao

Gayatri Rao

మరిన్ని ఇక్కడ చదవండి :

Shyam Singha Roy: షూటింగ్ షురూ చేసిన శ్యామ్ సింగరాయ్.. బ్యాక్ ఇన్ యాక్షన్ అంటూ పోస్టర్

Srinu Vaitla: గ్యాప్ రాదు రానివ్వను అంటున్న శ్రీను వైట్ల.. మూడు సినిమాలను లైన్లో పెట్టిన డైరెక్టర్

AHA OTT: ఈ వీకెండ్‌ ‘ఆహా’తో చిల్‌ అవ్వండి.. ఒకే రోజు 15 సినిమాలు. ‘లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండాలి కదండి’.