Chiranjeevi Tweet: ‘తెలుగుతనానికి ఆయన నిలువెత్తు రూపం’… వెంకయ్య నాయుడు పుట్టిన రోజు చిరు ట్వీట్‌..

Chiranjeevi Tweet: ఏబీవీపీ కార్యకర్తగా మొదలు పెట్టి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగారు ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఎన్నో కీలక పదవులు అదిరోహించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు వెంకయ్య. తెలుగు భాషపై ఆయనుకున్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే..

Chiranjeevi Tweet: 'తెలుగుతనానికి ఆయన నిలువెత్తు రూపం'... వెంకయ్య నాయుడు పుట్టిన రోజు చిరు ట్వీట్‌..
Chiru Tweet Venkaiah Naidu
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 01, 2021 | 9:10 PM

Chiranjeevi Tweet: ఏబీవీపీ కార్యకర్తగా మొదలు పెట్టి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగారు ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఎన్నో కీలక పదవులు అదిరోహించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు వెంకయ్య. తెలుగు భాషపై ఆయనుకున్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే గురువారం (జులై1) రోజున వెంకయ్య నాయుడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మరికొందరు నేతలు వెంకయ్యనాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా వెంకయ్యకు జన్మదిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరు ట్వీట్‌ చేస్తూ.. ‘అలుపెరుగని నిత్యపరిణామ శీలి,అజాత శత్రువు,తెలుగుతనానికి నిలువెత్తురూపం అయిన దేశ ఉపాధ్యక్షులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి జన్మ దిన శుభాకాంక్షలు.పది కాలాల పాటు ఆయన ఆయురారోగ్యాలతో ఇలాగే దేశ, సమాజ సేవలో పాలుపంచుకోవాలని కోరు కుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే చిరుకు వెంకయ్య నాయుడితో మంచి సాన్నిహిత్యం ఉందన్న విషయం తెలిసిందే. గతంలో చిరు నటించిన సైరా నర్సింహా రెడ్డి సినిమా విడుదల సందర్భంగా వెంకయ్యనాయుడు చిరంజీవితో కలిసి సినిమాను వీక్షించిన విషయం తెలిసిందే.

చిరు చేసిన ట్వీట్..

Also Read: Best Work Place: దేశంలో ఉద్యోగానికి ఉత్తమమైన సంస్థ గూగుల్ ఇండియా..సర్వేలో వెల్లడి 

Kangana And Tapsee: ‘మనుషుల కుళ్లు స్వభావానికి ఇదో నిదర్శనం’.. తాప్సీ, కంగనాల మధ్య తారా స్థాయికి చేరిన మాటల యుద్ధం.

Suman MAA Elections: ‘భారత్‌లో పుట్టిన వారంతా లోకల్‌’.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్‌.. మా ఎన్నికలను ఉద్దేశించేనా?